వెన్కెపల్లివాసికి ఇండియన్ పోలీస్ మెడల్
సైదాపూర్ మండలంలోని వెన్కెపల్లి గ్రామస్తుడు, వరంగల్ జిల్లా కాజీపేట ఏసీపీ బెదరకోట జనార్దన్ రాష్ట్రపతి అందజేసిన ఇండియన్ పోలీస్ మెడల్‌ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు.
సైదాపూర్: మండలంలోని వెన్కెపల్లి గ్రామస్తుడు, వరంగల్ జిల్లా కాజీపేట ఏసీపీ బెదరకోట జనార్దన్ రాష్ట్రపతి అందజేసిన ఇండియన్ పోలీస్ మెడల్‌ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. వెన్కెపల్లికి చెందిన బెదరకోట రామస్వామి–రాములమ్మ దంపతుల రెండోసంతానం జనార్దన్. ఉన్నతచదువులు పూర్తి చేసి 1989లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. భూపాల్‌పల్లి, బచ్చన్నపేట, ఘన్‌పూర్, తొర్రూర్, సుబేదారి, మహబూబాబాద్‌లో విధులు నిర్వర్తించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది బయ్యారం, హసన్‌పర్తి, హన్మకొండలో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతితో మామునూర్ అసిస్టెంట్ కమాండెంట్, వరంగల్‌ఎస్బీ డీఎస్పీ, ప్రస్తుతం కాజీపేట ఏసీపీగా పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికచేసింది. ఈసందర్భంగా వెన్కెపల్లి సింగిల్ విండో ౖచెర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, వెన్కెపల్లి మాజీ సర్పంచ్ కొత్త నారాయణరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ కొత్త మల్లారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కూతురు విద్వాన్‌రెడ్డి,ౖ సెదాపూర్ సర్పంచ్ కనుకుంట్ల విజయ్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు.