
అంతటాశోభ
మానవాళికి శుభసందేశమందించిన పరిశుద్ధాత్ముడి జన్మదిన వేడుకలు శనివారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రార్థనామందిరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ప్రార్థన మందిరంలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే ఘట్టాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. యేసు ప్రభువు పుట్టిన రోజున ఆకాశంలో ఒక తార తళుక్కుమని మెరిసిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగా క్రైస్తవులు విద్యుద్దీపాలతో కూడిన స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా క్రిస్మస్ చెట్లను అందంగా ఏర్పాటు చేశారు.