నంద్యాలలో వ్యవసాయ స్టుడియో | agriculture studion in nandyal | Sakshi
Sakshi News home page

నంద్యాలలో వ్యవసాయ స్టుడియో

Published Fri, May 26 2017 11:04 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

agriculture studion in nandyal

ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి
 
బుక్కరాయసముద్రం: కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.13 కోట్లతో వ్యవసాయ స్డూడియో నిర్మించనున్నట్లు ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని రేకులకుంట ఆచార్య ఎన్‌జీ రంగా పరిశోధనా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో స్టుడియో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమాచారం చానల్‌లో ప్రసారం చేస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, చర్చా కార్యక్రమాలు, రైతుల విజయగాథలు ప్రసారం చేస్తామన్నారు. వ్యవసాయ సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు ఫార్మర్‌ కస్టమర్‌ కేర్‌ : 18004250430, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌: 18004252960కు రైతులు ఫోన్‌ చేయవచ్చన్నారు. ఉప వృత్తుల తయారీకి సంబంధించి మిషనరీల కోసం కేవీకేలకు రూ.3.50 కోట్లు నిధులు కేటాయించామన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement