అమరావతి మారథాన్‌ విజయవంతం చేయండి : కలెక్టర్‌ | amaravathi mardhan on jan 8th | Sakshi
Sakshi News home page

అమరావతి మారథాన్‌ విజయవంతం చేయండి : కలెక్టర్‌

Published Thu, Dec 29 2016 9:18 PM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

అమరావతి మారథాన్‌ విజయవంతం చేయండి : కలెక్టర్‌ - Sakshi

అమరావతి మారథాన్‌ విజయవంతం చేయండి : కలెక్టర్‌

విజయవాడ :  నూతన రాజధానిలో జనవరి 8న నిర్వహించే అమరావతి మారథాన్ లో ఎక్కువమంది పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ బాబు. ఏ కోరారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో మారథాన్‌ నిర్వహణపై ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మారథాన్‌లో పాల్గొనే వారికి గతేడాది కంటే మూడు రెట్లు అధికంగా రూ. 20 లక్షల రూపాయలు ప్రైజ్‌ మనీగా ఇస్తున్నామన్నారు.రన్‌లో పాల్గోనేవారికి మెడల్‌తోపాటు సర్టిఫికేట్, కిట్‌ ఇస్తామన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. 3500 మంది ఆన్‌లైన్‌లో నమోదయ్యారన్నారు. గతేడాది 6వేల  మంది నమోదు చేసుకోగా,  8500 మంది పాల్గొన్నారన్నారు. రెండోసారి నిర్వహిస్తున్న ఈ రన్‌కు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో పాఠశాల విద్యార్ధులకు నగదు రహిత చెల్లింపులు నిర్వహించే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్ధ కమీషనర్‌ వీరపాండ్యన్‌ మాట్లాడుతూ డీప్‌ ట్రస్టుతో కలిసి నగరపాలక సంస్థ సంయుక్తంగా మారథాన్‌  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీప్‌ ఫౌండర్‌ ప్రతినిధి  డాక్టర్‌ మధు మాట్లాడుతూ ఆప్‌ మారధాన్, 10కె, 5కె, 3కెలుగా రన్‌ నిర్వహిస్తామన్నారు. రిజిస్టర్‌ చేసుకున్నవారు 6,7 తేదీల్లో దండమూడి రాజగోపాల్‌ మున్సిపల్‌ మినీ స్టేడియంలో కిట్స్‌ పొందాలన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసంఠీఠీఠీ.్చఝ్చట్చఠ్చ్టిజిజీఝ్చట్చ్టజిౌn.టun.నమోదు చేసుకోవాలన్నారు. స్వయంగాచేసుకునే వారు ఇందిరా గాంధీ స్టేడియంలో స్పోర్ట్స్‌ అథారిటీలో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల ప్రధానోపాద్యాయులతోపాటు సబ్‌ కలెక్టర్‌ సలోనిసిదా, డీఈవో సుబ్బారెడ్డి, విద్యాశాఖధికారులు పాల్గొన్నారు.


29 వీఐజీ పోటో నెం. 42ఏ, మారధాన్‌ రన్‌పై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement