అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ‘కత్తుల’ ఎంపిక
మిర్యాలగూడ టౌన్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ ఫేలోషిఫ్–2016 అవార్డుకు రాష్ట్రం నుంచి మిర్యాలగూడ పట్టణానికి చెందిన మున్సిపల్ ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కత్తుల సూర్యనారాయణను ఎంపిక చేసినట్లు భారతీయ దళిత సాహిత్య అకాడమి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌పీ సుమనాక్షార్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ జారీ చేసిన పత్రాన్ని కత్తుల సూర్యనారాయణ హైదరాబాద్‌లోని రాష్ట్ర భారతీయ దళిత సాహిత్య ఆకాడమి కార్యాలయంలో సోమవారం అందుకున్నారు. ఈ అవార్డును ఢీల్లీలో డిసెంబరు 11, 12వతేదిల్లో జరిగే భారతీయ దళిత సాహిత్య ఆకాడమిలో కత్తుల అందుకొనున్నారు. ఇయన 1983 నుంచి ఇప్పటి వరకు సామాజిక ఉద్యమంతోపాటు అంబేద్కర్ యువజన సంఘాన్ని బలోపేతం చేయడంలో ప్రధాన భూమికను పోషించారు. కత్తుల జాతీయ ఫేలోషిప్‌అవార్డుకు ఎంపిక కావడం పట్ల మున్సిపల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.