- వేతనాలు, బిల్లులు సక్రమంగా చెల్లించాలని డిమాండ్
ప్రభుత్వ తీరుపై అంగన్ ‘వేడి’
Published Mon, Apr 24 2017 11:46 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
కాకినాడ సిటీ :
సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అంగ¯ŒSవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పని చేస్తున్న అంగ¯ŒSవాడీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరించడంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ అంగ¯ŒSవాడీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని, పాలకులు మాత్రం వారి సమస్యల పరిష్కార విషయంలో పటీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెట్టడం వల్ల ప్రతి నెలా అప్పులు చేసి కుటుంబాలు గడుపుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు చెల్లించే చర్యలు తీసుకోవాలని, వేతన, కేంద్రాల అద్దెలు, ఇతర బిల్లుల బకాయిలు తక్షణం చెల్లించాలని, తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు పెంచిన విధంగా రాష్ట్రంలో వర్కర్లకు రూ.10,500, హెల్పర్లకు రూ.6,500 పెంచాలని, ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం ఒంటిపూట సెలవులు, మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని, సమస్యల పరిష్కారానికి యూనియ¯ŒS ప్రతినిధులకు, అధికారులతో ప్రతి నెలా సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జీ, సీఐటీయూ నాయకులు రాజ్‌కుమార్, కృష్ణవేణి, ఐద్వా నాయకురాలు రమణి, అంగ¯ŒSవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియ¯ŒS జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్‌కె.ఫాతిమా పాల్గొన్నారు.
Advertisement