అవినీతిని నిర్మూలనకు నడుం కట్టాలి
అవినీతిని నిర్మూలనకు నడుం కట్టాలి
Published Fri, Nov 4 2016 10:51 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
గూడూరు : సమాజంలో అవినీతి నిర్మూలనకు యువత నడుం కట్టాలని ఆంధ్రా బ్యాంక్ డిప్యూటీ జీఎం కేఎస్‌పీవీ రమణమూర్తి అన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి సహకరంతో యాంటీ కరప్షన్ అవైర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అవినీతితోనే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు యాంటీ కరప్షన్‌పై వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ కేవీఎస్‌ఎన్ మూర్తి, కళాశాల డైరెక్టర్ కృష్ణకుమార్, ప్రిన్సిపల్ ఎస్వీ రమణ, శిక్షణ విభాగాధిపతి ప్రభుకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కృషి చేయాలి
కోట : సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతమొందిచడానికి ప్రతిఒక్కరు కృషిచేయాల్సిన అవసరముందని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రమణమూర్తి అన్నారు. విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలను విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. కళాశాల మరియు ఆంధ్రాబ్యాంక్‌శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అవినీతికి అరికట్టడానికి విద్యార్థులు తమవంతుగా కృషి చేయాలన్నారు. దేశ ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement