విజయవాడ: తుపాను, వరదలతో తీవ్రంగా నష్టపోయామని ... ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీలో వరదల కారణంగా ప్రాథమికంగా 3 వేల కోట్ల మేర నష్టం జరిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తక్షణ సాయంగా రూ.1000 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా తన లేఖలో విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జరిగిన మొత్తం నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.