'ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు' | ap gov't Abuse sc, st laws says ysrcp leader meruga | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు'

Published Thu, Nov 19 2015 5:11 PM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

ap gov't Abuse sc, st laws says ysrcp leader meruga

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఈ నెల 26న గుంటూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అవలంభించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితుల హక్కులను చంద్రబాబు ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని, తీరు మార్చుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement