సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన, అభివద్ధి సంస్థ, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో పట్టుశాఖలో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కిరికెర ఏపీఎస్‌ఎస్‌ఆర్‌డీఐ సంచాలకులు పీజే రాజు తెలిపారు. హిందూపురంలోని కిరికెర ఆంధ్రపదేశ్ పట్టుపరిశోధన అభివద్ధి కేంద్రంలో తరగతులు నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రూ.500 అపరాధ రుసుంతో నవంబర్ 30 వరకు దరఖాస్తుచచేసుకోవచ్చన్నారు.
శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకంలో రెండేళ్ల అనుభవం లేదా పదో తరగతి చదివిన వారు కోర్సులో చేరటానికి అర్హులన్నారు. ఫీజు రూ.3500 ఉంటుందన్నారు. గ్రామీణ, పట్టణ దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న అభ్యర్థులకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కిరికెరలోని పట్టుపరిశోధన అభివద్ధి సహాయ సంచాలకులను సంప్రదించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు డాక్టర్ పీజే రాజు 98666 99603, శావేత్తలు ఏకే గోయల్ 95020 03728, ఎస్‌వీ శేషగిరి 94410 26695, హెచ్.లక్షి్మ 99590 99288 నంబర్లను సంపద్రించాలన్నారు.