sericulture
-
చేనేత కార్మికులు, మల్బరీ సాగు రైతుల సమస్యలపై గళమెత్తిన కవిత
-
హార్టికల్చర్, సెరీ కల్చర్, మైక్రో ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష
-
అగ్రికల్చర్ విద్యార్థులు ఆర్బీకేల్లో నెల రోజులు పని చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: హార్టికల్చర్,సెరికల్చర్,వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలి. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని’’ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్నూలులో ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి ‘‘కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్ పెట్టండి. నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి. టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు. దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిల్చిందని అధికారులు తెలిపారు. మిరప పంట విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్నారు. పుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం జగన్ అదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. కొబ్బరికి మంచి ధర వచ్చేలా చూడాలి కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని.. కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్ ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని.. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని తెలిపారు. దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితోపాటు ప్రాసెసింగ్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం.. వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ‘‘రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలి. దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది.. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలి. అగ్రికల్చర్ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి. దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయని’’ సీఎం జగన్ తెలిపారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సిహించాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యానపంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులను మోటివేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2020–21లో ఈ విధంగా 1 లక్షా 42వేల 565 ఎకరాల్లో అదనంగా ఉద్యానపంటలు సాగు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ యేడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు అధికారులు. పువ్వుల (ప్లోరీకల్చర్) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్ అవకాశాలు, వాటి ప్రాసెసింగ్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్ష ‘‘తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. రివర్స్ టెండరింగ్‌కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయి. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి’’ అన్నారు సీఎం జగన్. సెరికల్చర్ సాగు– ప్రోత్సాహం సెరికల్చర్ సాగు విధానం, ఉత్పాదకతపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. పట్టుగూళ్ల విక్రయాల్లో ఇ– ఆక్షన్ విధానం తీసుకొచ్చామని తెలిపారు అధికారులు. దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలుచేస్తున్నారని, రైతులకు ధరలు వస్తున్నాయని తెలిపారు. 1250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టుపురుగులు పెంచుతున్న రైతులు ఉన్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. సెరికల్చర్ సాగు ప్రోత్సాహకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. రైతులకు షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.. తద్వారా చిన్న రైతులను సెరికల్చర్ సాగులో ప్రోత్సహించినట్టవుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్ జి శేఖర్ బాబు, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ ఎల్ శ్రీధర్‌రెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీఓ డాక్టర్ హరినాథ్ రెడ్డి, వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ టి జానకిరామ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీ: సెరీ కల్చర్ అభివృద్ధికి సర్కారు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని (సెరీకల్చర్) మరింతగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో టస్సార్ పట్టు పురుగుల పెంపకం ద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో రెండో స్థానంలో ఉంది. ముడి పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా మన రాష్ట్రానికి బెస్ట్ బైవోల్టైస్ సెరీకల్చర్ ప్రాక్టీసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డు లభించింది. మల్బరీ విస్తరణకు ప్రోత్సాహకాలు రాష్ట్రంలో 1,19,050 ఎకరాల్లో 68,921 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అనంతపురంలో 48,922 ఎకరాలు, చిత్తూరులో 46,400 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. తూర్పు ఏజెన్సీ పరిధిలోని 7,500 ఎకరాల్లో టస్సార్ సాగు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 59,079 టన్నుల పట్టుగూళ్లు, 8,420 టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు పరిశ్రమపై ఆధారపడి 13.09 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,053.70 కోట్ల స్థూల విలువ సాధించిన పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన రెండేళ్లలో 13,500 ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి రాగా.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో 10వేల ఎకరాల్లో మల్బరీ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.51.920 కోట్ల అంచనాతో కార్యాచరణ సిద్ధం చేశారు. ‘సిల్క్ సమగ్ర’ పథకం కింద రూ.35.47 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ (ఎస్డీఎస్) కింద రూ.12.29 కోట్లను ప్రతిపాదించారు. ఇప్పటికే ఎస్డీఎస్ కింద రూ.12.29 కోట్లు విడుదల చేయగా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.19.86 కోట్లు కేటాయింపులు జరిపారు. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ మొక్కలు వేసుకునేందుకు రూ.10,500, షెడ్‌కు రూ.3 లక్షలు, పరికరాలకు రూ.57,500, మందుల కోసం రూ.3,750 చొప్పున రైతులకు అందిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న తెల్ల పట్టుగూళ్లకు కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్ కూడా ఇస్తోంది. కొత్తగా మూడు ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు గత ప్రభుత్వ హయాంలో తగిన ప్రోత్సాహం లేక నిస్తేజంగా తయారైన పట్టు పరిశ్రమకు ప్రస్తుత ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవడంతో మూలనపడ్డ మగ్గాలు సైతం మళ్లీ నేత నేస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో పెద్దఎత్తున పట్టు పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు హిందూపురం, తాడిపత్రి, కుప్పం, శాంతిపురం, ధర్మవరంలలోనే పట్టు ఆధారిత పరిశ్రమలున్నాయి. గడచిన రెండేళ్లలో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల పెట్టుబడులతో మదనపల్లి, పెద తిప్పసముద్రం, చేబ్రోలులో కొత్తగా ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ధర్మవరంలో మరో పరిశ్రమ రాబోతుంది. రైతులు ముందుకు రావాలి పట్టు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మల్బరీ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక్కసారి మొక్కలు వేస్తే కనీసం 20 ఏళ్ల పాటు ప్రతినెలా ఆదాయం వస్తుంది. తొలి ఏడాది 600 కేజీలు, రెండో ఏడాది 800 కేజీల చొప్పున పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమేపి వెయ్యి నుంచి 1,200 కేజీల వరకు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పట్టుగూళ్లకు మంచి రేటు పలుకుతోంది. సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునిస్తుంది. – సి.అరుణకుమారి, అడిషనల్ డైరెక్టర్, సెరీకల్చర్ -
వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలి అన్న దానిపై కార్యచరణ రూపొందించాలని.. మల్బరీ రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులందరికీ కూడా డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి. ఏం చేసినా శాచ్యురేషన్ పద్ధతిలో ఉండాలి. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదు.. అందరికీ అందాలి. వ్యవస్థలో అవినీతి ఉండకూడదు. చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలి’’అని సీఎం జగన్ తెలిపారు. రివర్స్ టెండరింగ్‌లో సూక్ష్మ సేద్యం సదుపాయాలు ‘‘రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలి. సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్ పద్దతిలో కొనుగోలు చేయడం ద్వారా రేటు తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ మంది రైతులకు సూక్ష్మ సేద్యం సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుంది. సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రైతులకున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని’’ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అగ్రి ఇన్ఫ్రాపై సీఎం సమీక్ష అగ్రి ఇన్ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్ యూనిట్లు తదితర 14 సదుపాయాల గురించి చర్చించారు. వీటి కోసం 14,562 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్ చేయాలి. దీనికి సంబంధించి పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఉంచాలని’’ సీఎం సూచించారు. ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం -
పట్టుశాఖలో 30 మంది బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: పట్టుపరిశ్రమశాఖలో శనివారం జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలకు సంబంధించి అర్హులైన ఉద్యోగులకు జేడీ అరుణకుమారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి వారిచ్చిన ఆప్షన్ల మేరకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. టెక్నికల్ ఆఫీసర్స్ 13 మంది, టెక్నికల్ అసిస్టెంట్స్ ఏడుగురు, ఆఫీస్ సబార్డినేట్స్ ఏడుగురు, డ్రైవర్లు ముగ్గురు బదిలీ అయ్యారు. -
పట్టుపురుగుల పెంపకంలో ‘వేసవి’ జాగ్రత్తలు
ఉష్ణోగ్రత నియంత్రణ, పరిశుభ్రత, ఆకు నాణ్యతపై దృష్టి పట్టు పరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి ఫిరోజ్ అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో పట్టుపురుగుల పెంపకంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పట్టుపరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి ఎస్ఏ ఫిరోజ్‌బాషా (98495 63802) తెలిపారు. మంచి పంట దిగుబడులు సాధించాలంటే కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాలన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, ఆకు నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. వేసవి యాజమాన్యం: + షెడ్డులో 28 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలిలో తేమ 70 శాతానికి తక్కువ కాకుండా చూచుకోవాలి. అవసరమైతే ఫ్యాన్లు, కూలర్లు, షెడ్డు కిటికీలు, వాకిళ్లకు తడిచిన గొనె సంచులు, అలాగే డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల ద్వారా షెడ్డు పైభాగాన నీటి తడులు, షెడ్డుపైన, చుట్టూ వరండాపై కొబ్బరి ఆకులు, బోధగడ్డి లాంటివి వేసుకోవాలి. వేసవిలో వ్యాపించే పాలురోగం వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి జాగ్రత్తలు తీసుకోకపోతే పంట దిగుబడి 20 నుంచి 30 శాతం తగ్గుతుంది. + పురుగులు పెంచే తట్టలు, షూట్ స్టాండ్, నేల, చంద్రికలు, షెడ్డు పరిసరాల్లో కంటికి కనబడని సూక్ష్మజీవులు ఉంటాయి. సరైన యాజమాన్య పద్ధతులతో వాటిని నాశనం చేయాలి. బ్లీచింగ్ పౌడరు, శానిటెక్ (క్లోరినేషన్), ఆస్త్ర, కాల్చిన సున్నం, ఫార్మాలిన్ లాంటి వాటిని క్రమ పద్ధతిలో వాడటం ద్వారా సూక్ష్మజీవులు, పంటకు హాని చేసే ఇతరత్రా క్రిములను అరికట్టవచ్చు. + క్లోరిన్ వాయువును కాల్చిన సున్నం మీదకు పంపినపుడు కాల్షియం ఆక్సీక్లోరైడ్ విడుదల అవుతుంది. దీన్నే బ్లీచింగ్ పౌడరుగా పిలుస్తాం. క్లోరిన్ డైయాక్సైడ్ (శానిటెక్) అనే మందు స్థిర లక్షణాలు కలిగి ఉండి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని సులభంగా వాడుకోవచ్చు. శానిటెక్లో 20 వేలు పీపీఎంల క్లోరిన్ డైఆక్సైడ్ సాంధ్రత ఉంటుంది. పట్టుపురుగులకు సోకే అన్ని వ్యా«ధులకు కాల్చిన సున్నంతో కలిపిన 500 పీపీఎం క్లోరిన్డైయాక్సైడ్ను వాడొచ్చు. + పంట ముగిసిన వెంటనే షెడ్డులోపల, బయట ప్రాంతంలో బ్లీచింగ్ పౌడరు, ఫార్మాలిన్ వంటి వాటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత పెంపకం మొదలు పెట్టే ముందు మరోసారి శుభ్రం చేసుకోవడం వల్ల క్రిములు నశిస్తాయి. + పశువుల ఎరువు, వర్మీకంపోస్టుతో పాటు తగు పాళ్లలో రసాయన ఎరువులు, సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియంట్స్) వేసి ఆకు నాణ్యతను పెంచుకోవడం వల్ల పట్టుగూళ్లు దిగుబడులు పెరుగుతాయి. పుల్ల నాటుకునే స్థాయి నుంచి మార్కెట్లో పట్టుగూళ్లు విక్రయించే వరకు పట్టుపరిశ్రమ అమలు చేస్తున్న పథకాలు, రాయితీలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. -
కొత్త పద్ధతిలో మల్బరీ సాగు
– కర్నాటక తరహా వృక్ష పద్ధతిలో అధిక దిగుబడి - మన రైతులను ప్రోత్సహిస్తాం – పట్టుశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి అనంతపురం అగ్రికల్చర్ : కొత్త పద్ధతిలో మల్బరీ సాగును ప్రోత్సహిస్తున్నట్లు పట్టు పరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ చింతకుంట అరుణకుమారి, పట్టు సేవా కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి ఎస్ఏ ఫిరోజ్‌బాషా తెలిపారు. కర్నాటకలోని కోలార్, చిక్‌బళ్లాపూర్ జిల్లాల పరిధిలో రైతులు అనుసరిస్తున్న వృక్ష పద్ధతి ఇక్కడ కూడా అవలంభిస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ఆ దిశగా పట్టుశాఖ చర్యలు చేపట్టిందన్నారు. వృక్ష పద్ధతిలో సాగు వేప, చింత, ఇతర చెట్లు మాదిరిగా నీటి ఎద్దడిని తట్టుకుని పంట ఉత్పత్తులు అందించినట్లుగానే మల్బరీని కూడా వృక్ష పద్ధతిలో పెంచవచ్చు. దీని వల్ల తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చని కోలార్, చిక్‌బళ్లాపూర్ జిల్లాల రైతులు రుజువు చేశారు. ఈ తరహా పద్ధతిని జిల్లాలో అవలంభించడానికి వీలుగా ఇటీవల రైతులను కర్నాటక పర్యటనకు తీసుకెళ్లి అవగాహన కల్పించాం. సాగు విధానం వృక్ష పద్ధతిలో 4“4 అడుగులు గుంతలు తీసుకుని ఆరు నెలల వయస్సున్న నర్సరీ మల్బరీ మొక్కను నాటుకోవాలి. ఎకరాకు 420 మొక్కలు సరిపోతాయి. మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించాలి. నీటి వసతి తక్కువగా ఉంటే డ్రిప్ పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. గుంతలలో పశువుల ఎరువు, వర్మీకంపోస్టుతో పాటు జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత ఒక్కో చెట్టు నుంచి ఒక గుడ్డు మేపుకోవచ్చు. మొదటి సంవత్సరం మాత్రమే పెట్టుబడులు కొంత ఎక్కువగా ఉంటాయి. రానురాను పెట్టుబడులు బాగా తగ్గిపోతాయి. మూడున్నర అడుగుల ఎత్తు తర్వాత చెట్టును వృక్షం మాదిరిగా మార్పు చేసుకుని పురుగుల పెంపకం చేపట్టాలి. డాక్టర్ సాయిల్ అనే సేంద్రియ టానిక్ వాడాలి. ఎకరాకు ఒక లీటర్ మందు వేయి లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. జిల్లాలో కూడా ఇప్పటికే కొంత మంది రైతుల చేత ఈ తరహా పద్ధతిని ప్రోత్సహించాం. మున్ముందు మరింత ఎక్కువ మంది రైతులు వృక్ష పద్ధతిలో చేపట్టేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. -
సెరికల్చర్‌లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
హిందూపురం రూరల్ : ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెరికల్చర్ సర్టిఫికెట్ కోర్సును మంగళవారం ప్రారంభించారు. కిరికెర పట్టు పరిశోధన కేంద్రంలో ఆరునెలల పాటు శిక్షణ అందిస్తారు. మొదటి బ్యాచ్‌కు కోర్సుకు సంబంధించిన పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఇగ్నో ఆర్డీ రాజగోపాల్, పట్టు పరిశోధన కేంద్రం రీజినల్ డైరెక్టర్ పీజే రాజు తదితరులు పాల్గొన్నారు. -
రేషం పురుగుల వ్యర్థాలతో కంపోస్టు
అనంతపురం అగ్రికల్చర్ : రేషం (మల్బరీ) పురుగుల పెంచే సమయంలో రోజువారీ బయడపడేసే వ్యర్థాలను సద్వినియోగం చేసుకుంటే మంచి కంపోస్టు ఎరువు తయారవుతుందని పట్టు పరిశ్రమశాఖ సేవా కేంద్రం టెక్నికల్ ఇన్చార్జ్ ఎస్ఏ ఫిరోజ్‌బాషా (89495 63802) తెలిపారు. చాలా మంది షెడ్డు పరిసర ప్రాంతాల్లో లేదా మరెక్కడైనా వృథాగా పడేస్తారన్నారు. దీని వల్ల రెండు విధాలుగా రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఎక్కడిక్కడ వదిలేస్తే దుర్వాసన ద్వారా పట్టు పురుగులకు రోగాలు వ్యాపిస్తాయన్నారు. మరోవైపు ఎరువుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎకరా మల్బరీ తోట పెంపకం ద్వారా ఏటా 4 నుంచి 6 టన్నుల సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు. దీని వల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గిపోవడమే కాకుండా సేంద్రియ పోషకాల ద్వారా నాణ్యమైన పంట దిగుబడులు చేతికి వస్తాయని తెలిపారు. వ్యర్థాలు ఉపయోగించుకోండి : పట్టు పురుగులు పెంచే షెడ్డుకు కొంత దూరంలో నీడ ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని 4.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతను తవ్వుకోవాలి. ఎండ, వానల నుంచి రక్షణ కోసం గుంతపై పందిరి వేసుకోవాలి. పెంపకం సమయంలో రోజూ వచ్చే వ్యర్థ పదార్థాలను గుంతలో పొరలు పొరలుగా నింపాలి. ప్రతి అడుగు మందంపై పేడ నీటిని చల్లాలి. ఆ తర్వాత 25 కిలోల పాస్ఫేట్, 150 గ్రాములు సున్నం పొడిని చల్లాలి. భూమి నుంచి ఒక అడుగు ఎత్తు వరకు కంపోస్టు గుంతను నింపి అ తర్వాత మట్టి లేదా పశువుల పేడతో కప్పేయాలి. గుంతను నింపిన 3 నుంచి 4 నెలల తర్వాత నాణ్యమైన కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇలా చేయడం వల్ల ఓ వైపు మంచి ఎరువు తయారు చేసుకోవడమే కాకుండా పట్టుపురుగుల పెంపకం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. దీని వల్ల రెండు విధాలా రైతుకు లాభం ఉంటుంది. వ్యర్థాలు పెంపకం పరిసరాల్లో వేయడం వల్ల దుర్వాసనతో పాటు పట్టుపురుగులకు అనేక రోగాలు వ్యాపించి పంట దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో కంపోస్టు తయారీకి చర్యలు తీసుకోవాలి. జిల్లాలో కొందరు రైతులు ఇలా వినియోగించుకుంటున్నా చాలా మంది అలాగే వదిలేస్తున్నారని తెలిపారు. -
చలి చంపుతోంది
–పట్టు పురుగులకు సున్నపుకట్టు వ్యాధి – మల్బరీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి – పట్టుశాఖ సేవా కేంద్రం టీఓ ఎస్ఏ ఫిరోజ్‌బాషా అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది కాస్తంత ముందుగానే చలి వాతావరణం కనిపిస్తుండటంతో పట్టు పురుగుల పెంపకంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని పట్టుపరిశ్రమశాఖ సాంకేతిక సేవా కేంద్రం (టెక్నికల్ సర్వీసు సెంటర్) టెక్నికల్ ఆఫీసర్ (టీఓ) ఎస్ఏ ఫిరోజ్‌బాషా (98495 63802) సూచించారు. రాత్రిళ్లు చలిపెడుతున్నా పగటి పూట పూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటంతో కొద్దిరోజుల పాటు పగలు, రాత్రిళ్లు తప్పనిసరిగా వాతావరణాన్ని నియంత్రించుకోవాలన్నారు. మొత్తమ్మీద చలికాలం వచ్చేస్తుండటంతో గాలిలో తేమశాతం పెరిగి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పట్టు పురుగులకు సోకి పంట ఉత్పత్తులకు నష్టం కలిగించే సున్నపుకట్టు (మస్కార్డిన్) వ్యాధికి కారణమవుతుందన్నారు. వ్యాధి లక్షణాలు చలికాలం, వర్షాకాలంలో ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి సోకిన పురుగులు జీర్ణశక్తి, చురుకుదనాన్ని కోల్పోతాయి. నల్లటి మచ్చలు కనిపించి అప్లోటాక్సిన్ అనే విషపదార్థం ఉత్పత్తి వలన చనిపోతాయి. చనిపోయిన 6 నుంచి 8 గంటలకు దేహం గట్టిపడి దఢంగా మారుతుంది. అసంఖ్యాక కొనీడియాలు ఏర్పడటం వల్ల తెల్లగా తయారై సుద్దముక్కలా మారుతుంది. దీన్నే తెల్లబూజు కట్టు రోగం లేదా సున్నకట్టు వ్యాధిగా పిలుస్తారు. నివారణ ఇలా.. పెంపకం గది, పరిసరాలు, వాడే పరికరాలు శుభ్రంగా ఉండాలి. పంట పూర్తయిన తర్వాత వ్యాధి వల్ల చనిపోయిన పురుగులు, సుద్దముక్కల మారిన వాటిని, నాసిరకం పట్టుగూళ్లను తొలగించి కాల్చివేయాలి. 2 శాతం బ్లీచింగ్ పౌడరు, 0.2 శాతం సున్నపుపొడి ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. పట్టుగుడ్లు ఉపరితల భాగం నీలిచుక్క దశకు తిరగక మునుపే రెండో సారి 2 శాతం ఫార్మాలీన్ ద్రావణంలో ముంచి మంచినీటితో కడిగి నీడలో అరబెట్టి పొదిగించాలి. నాణ్యమైన పుష్టికరమైన మల్బరీ (రేషం) ఆకులను పురుగులకు ఇవ్వాలి. పురుగులు జ్వరానికి వెళ్లేముందు సున్నపుపొడిని పడకలపై చల్లి, గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. షెడ్డులో గాలి, వెలుతురు ప్రసరించేలా కిటికీలు ఎప్పుడూ తెరచివుండాలి. కిటికీలు, వెంటిలేటర్లను పాలిథీన్ కవర్లు, గోనె సంచులతో మూయకూడదు. పెంపకం షెడ్డులో 80 శాతం లోపు తేమ, 25 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే బొగ్గు కుంపెట్లు లేదా ఎలెక్ట్రికల్ హీటర్‌ను ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతను పెంచుకోవాలి. ఇవి వాడే సమయంలో కిటికీలు తెరవాలి. రాళ్ల సున్నంపై నీళ్లుచల్లి పొడిచేసిన సున్నపు పొడినే విధిగా వాడాలి. రోజూ పురుగుల పడకలను శుభ్రం చేసిన తరువాత వ్యర్థ పదార్థాలు షెడ్డు పరిసరాల్లో వేయడం వల్ల రోగకారక క్రిములు పురుగులకు వ్యాపించే అవకాశం ఉంది. షెడ్డుకు దూరంగానూ లేదా అలాంటి వ్యర్థాలను గోతి తీసి పూడ్చాలి. పెంపకం గదిలో గోడలు, స్టాండుల కింద సున్నపుపొడిని చల్లాలి. -
సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం రూరల్ : ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశోధన, అభివద్ధి సంస్థ, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో పట్టుశాఖలో ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కిరికెర ఏపీఎస్ఎస్ఆర్డీఐ సంచాలకులు పీజే రాజు తెలిపారు. హిందూపురంలోని కిరికెర ఆంధ్రపదేశ్ పట్టుపరిశోధన అభివద్ధి కేంద్రంలో తరగతులు నిర్వహిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రూ.500 అపరాధ రుసుంతో నవంబర్ 30 వరకు దరఖాస్తుచచేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టుపురుగుల పెంపకంలో రెండేళ్ల అనుభవం లేదా పదో తరగతి చదివిన వారు కోర్సులో చేరటానికి అర్హులన్నారు. ఫీజు రూ.3500 ఉంటుందన్నారు. గ్రామీణ, పట్టణ దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న అభ్యర్థులకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కిరికెరలోని పట్టుపరిశోధన అభివద్ధి సహాయ సంచాలకులను సంప్రదించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు డాక్టర్ పీజే రాజు 98666 99603, శావేత్తలు ఏకే గోయల్ 95020 03728, ఎస్వీ శేషగిరి 94410 26695, హెచ్.లక్షి్మ 99590 99288 నంబర్లను సంపద్రించాలన్నారు. -
‘పట్టు’ తప్పుతోంది!
కర్నూలు(అగ్రికల్చర్): సిబ్బంది కొరతతో జిల్లాలో పట్టుపరిశ్రమ శాఖ తన లక్ష్యాలను సాధించలేకపోతోంది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది (2014-2015 సంవత్సరానికి) లక్ష్యాన్ని పెంచి 1028.274 మెట్రిక్ టన్నుల పట్టు గూళ్లు ఉత్పత్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెరికల్చర్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లా స్థాయిలో సెరికల్చర్ ఉప సంచాలకుల పోస్టు దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. అనంతపురం జిల్లా సెరికల్చర్ జేడీ ఇక్కడ డీడీగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు, ప్యాపిలిలో ఏడీ పోస్టులుండగా ఆత్మకూరులో ఇన్చార్జి ఏడీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెరికల్చర్ ఆఫీసర్ల పోస్టులు తొమ్మిది ఉండగా ముగ్గురు మాత్రమే పని చేస్తున్నారు. అసిస్టెంటు సెరికల్చర్ ఆఫీసర్‌పోస్టులది ఇదే కథ. ఎనిమిది మందికిగాను నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికేడాది పట్టు సాగు తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం 197 ఎకరాల్లో (ప్యాపిలి, వెల్దుర్తి, ఆత్మకూరు, నందికొట్కూరు ఆదోని ప్రాంతాల్లో) మల్బరీ సాగయింది. సబ్సిడీ వివరాలకు జిల్లా పట్టుపరిశ్రమ శాఖ ఉపసంచాలకులు అరుణకుమారి- 9866559547. ఆత్మకూరు ఏడీ -9866557851, ప్యాపిలి ఏడీ -9866699181 సెల్‌నంబర్లను సంప్రదించవచ్చు. -
పట్టు గుట్టు పెరుమాళ్
ఖర్చు తక్కువతో అధికాదాయం నెలకొకటి చొప్పున ఏడాదికి 12 పంటలు ఎకరన్నర పొలంలో మల్బరీ సాగు.. నెలకు రూ. 80 వేల నికరాదాయం తమిళనాడు రైతు విజయగాథ జిలుగు వెలుగుల పట్టుబట్టలు అతివలకు అందాన్ని, మగవారికి హుందాతనాన్ని ఇస్తాయి. పట్టు పోగులతో ఆవిష్కృతమైన కళాత్మక సృజన మనసును తాకిన కవి.. నరాల దారాల అల్లికగా నేతగాడి పనితనాన్ని కొనియాడాడే కానీ.. పట్టు రైతు కష్టాన్ని గుర్తించనే లేదు. పట్టు పురుగు మేలి వన్నెల వస్త్రంగా మారిన వైనానికి మూలవిరాట్టై, గుడ్డు నుంచి బయటకు వచ్చి గూడునల్లి తనువు చాలించే పట్టు పురుగులా అణగారిపోతున్న పట్టు రైతన్నల వ్యథార్థ జీవితం మీద దృష్టిసారించిన వారు మాత్రం అరుదు. మేలిమి మెరుపుల పట్టు వస్త్రం వెనుక దాగున్న రైతన్న శ్రమ ఎవరి దృష్టిలోనూ పడనే లేదు. పట్టు పురుగుల పెంపకం(సెరికల్చర్) వ్యవసా యంలో ఓ భాగం. దసిలిపట్టు, ఆరీపట్టు, మూగపట్టు అని పలు రకాలు, విధానాలు ఉన్నా మల్బరీ ద్వారా పట్టు ఉత్పత్తి చేయడానికే ప్రాధాన్యం ఎక్కువ. మల్బరీ తోటలను పెంచి, పట్టు గుడ్లను పొదిగించి మల్బరీ ఆకులను పట్టు పురుగులకు మేతగా వేసి పెంచి పెద్ద చేస్తే.. పట్టుగూళ్లు ఉత్పత్తవుతాయి. వ్యవసాయ రంగంలోని ఇతర నగదు పంటల్లాగే సెరికల్చర్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోనూ, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా పట్టుగూళ్ల పెంపకం చేపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెరికల్చర్ విభాగాన్నే ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో పట్టుగూళ్లు పెంచే రైతుల పరిస్థితి మాత్రం ‘ఆకుకు అందదు, పోకకు పొందదు’ అన్న చందంగానే కొనసాగుతోంది. కానీ, తమిళనాడులో పట్టు రైతుల పరిస్థితి వేరుగా ఉంది. నెలకు రూ. 80 వేల ఆదాయం పట్టుగూళ్ల పెంపకంలో ఎకరన్నర పొలంలో మల్బరీ తోట ఆధారంగా పట్టుగూళ్లు పెంచుతూ నెలకు రూ. 80 వేల ఆదాయం పొందుతున్నారు తమిళనాడుకు చెందిన పెరుమాళ్ స్వామి, నాగేశ్వరి రైతు దంపతులు. కోయంబత్తూరు జిల్లా ఉజ్జేయినూర్ తాలూకాలోని చినతడవం వారి స్వస్థలం. ఈ రైతు దంపతుల ఆదర్శ కృషిని పరిశీలించడానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక రైతుల బృందంతో కలిసి ‘సాగుబడి’ చినతడవం గ్రామంలోని పెరుమాళ్స్వామి పట్టుగూళ్ల పెంపక కేంద్రాన్ని సందర్శించింది. పెరుమాళ్స్వామి రెండెకరాల చిన్న రైతు. కొండలకు సమీపంలో ఉన్న చిన్నపల్లె. ఏ పంట వేసినా వచ్చే ఆదాయం చేతికి మూతికి అందని పరిస్థితి. ఒక్కోసారి పెట్టిన ఖర్చులూ తిరిగిరాని పరిస్థితి. వ్యవసాయం తప్ప వేరే ఏ ఆదాయ వనరూ లేదు. మరోవైపు వెన్నాడి తరుముతున్న ఆర్థిక అవసరాలు. తమకున్న దాంట్లోంచే ఆదాయం సృష్టిం చుకోవాలి. చుట్టుపక్కల చిన్న, సన్నకారు రైతులు పట్టు పురుగుల పెంపకం చేపట్టిన విషయం గమనించి, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి తామూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు పెరుమాళ్స్వామి దంపతులు.అదే సమయంలో స్థానిక సెరికల్చర్ అధికారి కూడా పట్టుపురుగుల పెంపకానికి ప్రభుత్వం అందించే సహాయం గురించి వీరికి వివరించారు. కష్టపడితే ఫలితం రాకపోతుందా? అన్న ఆశతో పట్టుగూళ్ల పెంపకాన్ని చేపట్టి చక్కటి ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ సాగుతో మేలు పట్టు పురుగుల పెంపకం ప్రారంభించే రైతులు సాధారణంగా పక్కా షెడ్లు నిర్మించడం, నేలను గచ్చు చేయడం పరిపాటి. ఈ అలవాటు వల్ల పెట్టుబడి బాగా పెరిగిపోతుంది. కానీ, అందుబాటులో ఉన్న వనరులతో పూరి పాకలను నిర్మించి, నేలను చదును చేసి, ఆవు పేడతో అలికితే తక్కువ ఖర్చులోనే పని పూర్తవుతుంది. పెరుమాళ్స్వామి అదే చేశారు. ఇంటికి సమీపంలోనే అందుబాటులో ఉన్న వనరులతో రెండు పాకలు నిర్మించారు. ఒకటిన్నర ఎకరంలో ‘వీ1’ రకం మల్బరీ మొక్కలు తెచ్చి నాటుకున్నారు. పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులు వాడడంతో ఆకు సైజు సాధారణ స్థాయికంటే రెట్టింపుగా ఎదిగింది. ప్రభుత్వం డ్రిప్పు పరికరాలు, మొక్కలను రాయితీపై సమకూర్చింది. పాకల నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటుకోవడానికి మొత్తం రూ. 30 వేలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో అందించింది. దీనికి తోడు పంటకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. కేవలం ఇద్దరు కూలీల సహాయంతో పట్టుపురుగులు పెంచుతున్న పెరుమాళ్స్వామి దంపతులు ఏడాదికి దాదాపు రూ. 6 లక్షల మేరకు నికరాదాయం పొందుతున్నారు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి’ డెస్క్ ఏడాదికి పన్నెండు పంటలు! పట్టు పురుగుల పెంపకంలో సిల్కీవార్మ్ దశ చాలా కీలకమైనది. ఈ దశలో పురుగులను పసిపిల్లలకంటే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. పురుగులు సిల్కీవార్మ్స్ దశ నుంచి చాల్కీ వార్మ్స్ దశకు మారడానికి 22 రోజులు పడుతుంది. ఈ దశ చాలా కీలకం. దిగుబడి పూర్తిగా ఈ దశ మీదే ఆధారపడి ఉంటుంది. సిల్కీవార్మ్స్ పెరిగే షెడ్డులోకి ఇతరులను అనుమతించం. ఈ దశలో పనులన్నీ మేమే స్వయంగా చూసుకుంటాం. నేలను ఆవుపేడ, పసుపు నీళ్లు కలిపి అలికిన తరువాత.. నెట్రికల మీద గుడ్ల అట్టలను పెట్టి పొదిగిస్తాం. 20 కార్డులకు రెండు లక్షల పురుగులు పుడతాయి. ప్రతి రోజూ బ్లీచింగ్ కలిపిన నీటితో షెడ్డు లోపలి అంచులు, బయటి ప్రాంతాలను శుభ్రం చేస్తాం. వైరస్, బ్యాక్టీరియా సోకకుండా ఈ జాగ్రత్త. పురుగులు చాల్కీవార్మ్స్గా మారిన తరువాత, వాటిని తీసి బయట ఉన్న షెడ్డులోని నెట్రికల్లోకి మారుస్తాం. మొదట్లో చంద్రికల్లో పురుగుల పెంపకం సాగేది. అయితే, దీని వల్ల శ్రమ ఎక్కువ. ఎక్కువ మంది కూలీలు కావాల్సి ఉంటుంది. నెట్రికల్లో ప్లాస్టిక్ ప్యాడ్లను అమర్చి, వాటి మీద చాల్కీ పురుగులను వదిలి, మల్బరీ ఆకు వేస్తాం. నెల రోజుల్లో పురుగులు పట్టు గూళ్లు అల్లుతాయి.. ఈ విధంగా 12 నెలల్లో 12 పంటలు తీస్తున్నాం. నెలకు ఎంత లేదన్నా 175 కిలోల పట్టుగూళ్లు లభిస్తాయి. కోయంబత్తూరు మార్కెట్లో కిలోకు రూ. 460 ధర గిట్టుతోంది. సగటున నెలకు రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ఇందులో రూ. 30 వేలు నిర్వహణ ఖర్చులు తీసివేస్తే రూ. 50 వేలు నికరంగా మిగులుతోంది. ఈ విధంగా సంవత్సరానికి రూ. 6 లక్షల నికరాదాయం లభిస్తోంది. - ఆర్. పెరుమాళ్ స్వామి (09442235868) (ఈయన తమిళంలో మాత్రమే మాట్లాడగలరు), చిరునామా: చినతడవం, ఉజ్జేయినూర్ తాలూకా, కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు