బెలుం గుహల్లో ఆర్మీ కల్నల్
కొలిమిగుండ్ల: బెలుం గుహలను శనివారం సికింద్రాబాద్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ కల్నల్(ఐజీ) అతుల్‌గోషిక్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. గుహల సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పలు ఆకారాలను తిలకించారు. భూమి లోపల గుహలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఆధ్మాత్మిక సంగీతం ఏర్పాటు చేస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విహార యాత్రలో భాగంగా జిల్లాలోని రాక్‌గార్డెన్స్‌తో పాటు అవుకు రిజర్వాయర్ తిలకించామన్నారు. అనంతరం మార్గమధ్యలో కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆగి ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్యతో ముచ్చటించారు.