దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు | Artificial organs free for physically challenged persons | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు

Published Tue, Apr 25 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్‌ అందిస్తున్నట్లు భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(టౌన్‌): దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్‌ అందిస్తున్నట్లు భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలిమేర వేణుగోపాల్‌, కామాక్షమ్మ చారిటబుల్‌ ట్రస్టు సౌజన్యంతో జైపూర్‌ కాలు కంటే నాణ్యమైన కృత్రిమ కాలును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 14వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94404 41447 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement