
విజయవాడలో కొనసాగుతున్న బంద్
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ విజయవాడతో పాటు కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. బంద్ సందర్భంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పలువురు వైఎస్‌ఆర్‌సీపీ, వామసక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నాలు చేపట్టడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.