గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు
నూనెపల్లె: బ్యాంక్ కరెస్పాండెంట్లతో (బీసీ) గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తామని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ జి. శివశంకర్ రెడ్డి తెలిపారు. స్థానిక నేషనల్ బీఎడ్ కళాశాలలో సోమవారం నంద్యాల రీజియన్ బ్యాంక్ కరెస్పాండెంట్లకు ఏపీజీబీ కడప ప్రాంతీయ కార్యాలయ మేనేజర్ రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన బ్యాంక్ లావాదేవీలపై శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ సేవలు అందాలంటే బీసీలే కీలకం అన్నారు. ఇప్పటికే రుణాల రికవరీలు, నోటీసుల జారీ తదితర బాధ్యతలు వారికి అప్పగించామని చెప్పారు. అనంతరం క్యాస్‌లెస్ లావాదేవీలు సాగించిన బీసీలను సత్కరించారు. సమావేశంలో ఏపీజీబీ కార్యాలయ సీనియర్ మేనేజర్ రవిమోహన్, మేనేజర్లు మద్దిలేటి, సుల్తానా, టెక్నీషియన్లు రవిప్రకాష్, భాస్కర్, పాల్గొన్నారు.