ఆంధ్రప్రదేశ్ వెనుకబడితన తరగతుల సంక్షేమశాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో పేరొందిన బ్యాంకు కోచింగ్ సెంటర్ల నుంచి ఎన్టీఆర్ ఉన్నత విద్య ఆదరణ పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో పీఓ ఉద్యోగాలకు సంబంధించి 700 మందికి, క్లర్క్ ఉద్యోగాలకు 1250 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
కడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ వెనుకబడితన తరగతుల సంక్షేమశాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో పేరొందిన బ్యాంకు కోచింగ్ సెంటర్ల నుంచి ఎన్టీఆర్ ఉన్నత విద్య ఆదరణ పథకం ద్వారా రాష్ట్ర స్థాయిలో పీఓ ఉద్యోగాలకు సంబంధించి 700 మందికి, క్లర్క్ ఉద్యోగాలకు 1250 మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణా కాలం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుందన్నారు. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల్లోపు ఉండాలన్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ఈ ఆగస్టు 1వ తేది నాటికి 31 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. డిగ్రీ అర్హత కలిగి వైఎస్సార్‌జిల్లాకు చెందిన బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీసీ విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా తమ దరఖాస్తులను డబ్లు్యడబ్లు్యడబ్లు్య.బీసీ వెల్ఫేర్.జీఓవీ.ఐఎన్ అనే వెబ్‌సైట్ ద్వారా పంపాలన్నారు. ఇతర వివరాలకు 08562–242526, 94910 54116, 970318 5382 నెంబర్లలో సంప్రదించాలన్నారు.