
తప్పదు.. టైంకు రావాలి
♦ ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్
♦ పైలట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలం
బషీరాబాద్ : ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా టైంకు ఆఫీసుకు రావాల్సిందే. సాయంత్రం ఇంటికి సైతం పనిగంటలు ముగిశాకే వెళ్లాలి. ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో మొదటిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించిన అధికారులు పెలైట్ ప్రాజెక్టుగా బషీరాబాద్ మండలాన్ని ఎంపిక చేశారు.