ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో సాధారణ హాజరు పట్టికల విధానాన్ని దశల వారీగా తొలగించి దాని స్థానంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎన్డీఏ సర్కారు శుక్రవారం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డిసెంబర్ చివరిలోగా, ఇతర ప్రాంతాల్లో జనవరి 26 లోగా వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది.