ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి-మోచర్ల మధ్య 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది.
రోడ్డు ప్రమాదం: ప్రైవేటు బస్సు దగ్ధం
Jul 27 2016 7:54 AM | Updated on Aug 30 2018 4:07 PM
ఉలవపాడు: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి-మోచర్ల మధ్య 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు వేగంగా వెళుతూ కంటైనర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు దిగారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్‌ను మరో మార్గం గుండా మళ్లించారు. ప్రయాణికులను మరో బస్సులో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు బస్సులో 18 మంది ఉన్నారు. స్లీపర్ బస్సుకావడంతో అందరూ నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు.
Advertisement
Advertisement