బస్సుల నిర్వాహణ పక్కాగా ఉండాలి
బస్సుల నిర్వాహణ పక్కాగా ఉండాలి
Published Fri, Apr 14 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM
– కేఎంపీఎల్ పెంచేలా చర్యలు తీసుకోవాలి
– ఆర్టీసీ సీఎంఈ (ఓ) ప్రసాద్
కర్నూలు (రాజ్‌విహార్): బస్సుల నిర్వాహణ పనులను పక్కాగా నిర్వహించి సర్వీసులను పంపాలని రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (ఓ) కేవీఆర్‌కే ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక బళ్లారి చౌరాస్తా సమీపంలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో డిపో మేనేజర్లు, ఎంఎఫ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు రీజియన్‌లోని కొన్ని డిపోల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, బాధ్యులపై చర్యలు లేకనే ఇలా జరుగుతోందన్నారు. పనితీరును మెరుగుపర్చుకుని సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. డిపోల నుంచి బయటకు వెళ్లిన సర్వీసుల ఫెయిల్యూర్‌ను తగ్గించాలని, అందుకు మెకానికల్ సిబ్బందిని తగిన సూచనలివ్వాలని చెప్పారు. మైలేజీ విషయంలో రాజీ పడకుండా కేఎంపీఎల్ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రజియా సుల్తానా, డీసీఎంఈ రమేష్‌బాబు, డీఎంలు, మెకానికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement