కారు ఢీ- స్కూటరిస్టు మృతి
Published Mon, Dec 19 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
డోన్ టౌన్ : మండల పరిధిలోని ఓబులాపురం మెట్ట వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి క్రాస్ రోడ్డు పై ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు అక్కడికక్కడే మరణించారు. ప్యాపిలి మండలం మాదవరం గ్రామానికి చెందిన బోయ హనుమన్న (55) డోన్ మండలం ధర్మవరం గ్రామంలోని బంధువుల ఇంటి నుంచి మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామానికి కూతుర్ని చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఓబులాపురం మెట్ట వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా బెంగళూర్ నుంచి కర్నూలు వైపు వస్తున్న కారు (ఏపీ10బీఈ9444) ఢీకొంది. ఘటనలో హనుమన్న అక్కడిక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement