కాలువలోకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్ దుర్మరణం
నిడదవోలు రూరల్: పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో సమిశ్రగూడేనికి చెందిన యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ నజీముద్దీన్ కుమారుడు అబ్దుల్ నజీరుద్దీన్‌ఖాన్ (21) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిడదవోలుకు చెందిన ఏపీ 37 సీఆర్ 3879 ఫోర్డ్ కారులో నజీరుద్దీన్‌ఖాన్ రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తుండగా గోపవరం వేబ్రిడ్జి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కారు అదుపుతప్పి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకువెళ్లింది. నజీరుద్దీన్‌ఖాన్ కాలువలో గల్లంతయ్యా డు. ప్రమాద విషయం తెలుసుకున్న పో లీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. డ్రైవర్ కోసం కాలువలో ముమ్మరంగా గాలించగా మంగళవారం సాయంత్రం సమిశ్రగూడెం సమీపంలో మృతదేహం లభ్యమైంది. నజీముద్దీన్‌కు ముగ్గురు కుమారులు ఉండగా నజీరుద్దీన్‌ఖాన్ ఆఖరివాడు. రెండేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుం బానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. నిద్రమత్తులో కునుకుపడి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.