‘రవాణా’ బాదుడు
Published Sat, Mar 4 2017 11:35 PM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
► రవాణాశాఖ నిబంధనల్లో మార్పు
► ఇప్పటికే చార్జీలు పెంచిన కేంద్ర ప్రభుత్వం
► ఫిట్‌నెస్ పెనాల్టీ లేదు
► ఆటోడ్రైవర్లకు చదువుతో పని లేదు
రవాణా శాఖకు సంబంధించిన నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ శాఖకు సంబంధించి ప్రజలు వివిధ అవసరాలకు చేసుకునే దరఖాస్తు విధానం నుంచి, చార్జీల వరకు మార్పులు చెందాయి. వీటితో పాటు నిబంధనలు సడలాయి. మార్పు కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉన్నాయని రవాణా శాఖ కార్మికుల విమర్శిస్తున్నారు.
తెనాలి రూరల్ : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు వాహనాల విడి భాగాల ధరలు అమాంతంగా పెరగడమూ 90 శాతంగా ఉన్న ఓనర్ కం డ్రైవర్లకు భారంగా ఉంది. ఈ దశలో రవాణా శాఖకు సంబంధించి చార్జీలు, పెనాల్టీలు పెంచడం దారుణమనే వాదనలూ లేకపోలేదు.
ఫిట్‌నెస్ పెనాల్టీ రద్దు..
పిట్‌నెస్ లేని వాహనాలకు విధించే పెనాల్టీలను ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. గతంలో రోజుకు రూ. 50 చొప్పున పెనాల్టీ చార్జీలు వసూలు చేసే వారు. దీని వల్ల ఏడాదికి సుమారు రూ. 18, 250 వరకు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇదీ భారమేనని, తగ్గించాలన్న డిమాండ్ కారణంగా ఎత్తివేశారు.
బ్యాడ్జికి చదువుతో నిమిత్తం లేదు..
ఆటో డ్రైవర్లు లైసెన్సు తీసుకోవడానికి గతంలో కనీసం ఎనిమిదో తరగతి చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధననూ సడలించారు. బ్యాడ్జి కావాల్సిన ఆటో డ్రైవర్లు, సంబంధిత రవాణా అధికారి కార్యాలయానికి వెళ్లి, స్వీయ అంగీకార పత్రాన్ని సమర్పించి బ్యాడ్జిని పొందవచ్చు.
Advertisement
Advertisement