ఘర్షణ: మంత్రి తండ్రికి స్వల్ప గాయాలు | clashes between trs leaders in nalgonda district | Sakshi
Sakshi News home page

ఘర్షణ: మంత్రి తండ్రికి స్వల్ప గాయాలు

Published Mon, Aug 8 2016 7:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

clashes between trs leaders in nalgonda district

నల్లగొండ: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.  అందులోభాగంగా మంత్రి జగదీష్రెడ్డి సమీప బంధువు మందడి విద్యాసాగర్రెడ్డి ఇంటిపై మరో వర్గం వారు దాడి చేశారు. అతడి ఇంట్లోకి చొరబడి కారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన విద్యాసాగర్ కుటుంబ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, గున్నారెడ్డి, మరో వ్యక్తిపై దాడి చేశారు.

ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు.  స్థానికులు వెంటనే స్పందించి... వారిన కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనలో మంత్రి జగదీశ్రెడ్డి తండ్రికి కూడా స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement