ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.35 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
అనంతపురం అర్బన్ / కదిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఉదయం 10.35 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.50 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ వేరుశనగ పంటను పరిశీలిస్తారు.
పంట సంజీవనిపై రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కోటపల్లికి చేరుకుంటారు. ఇక్కడా క్షేత్ర స్థాయిలో వేరుశనగను పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు.