సీమ ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష | cm meet on seema projects | Sakshi
Sakshi News home page

సీమ ప్రాజెక్టులపై నేడు సీఎం సమీక్ష

Published Thu, Sep 1 2016 12:08 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

cm meet on seema projects

– అనంతపురానికి వెళ్లనున్న ఇంజినీర్లు
కర్నూలు సిటీ: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అనంతపురంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలోని ఆయా సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లు పెండింగ్‌ పనుల పురోగతి, సాగు నీటి వివరాలతో కూడిన నివేదికలతో వెళ్లనున్నారు. సాగు నీటి కాల్వల కింద సాగైన ఆయకట్టు, దీనికి అవసరమైన నీరు, ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వివరాలతో పాటు, రాయలసీమ జిల్లాల్లో ఎండుతున్న పంటలు, వాటిని కాపాడేందుకు రెయిన్‌ గన్స్‌ ద్వారా నీరు ఇచ్చేందుకు ఉండే అవకాశాలతో కూడిన నివేదికలను ఇంజినీర్లు సిద్ధం చేసుకున్నారు.
సీఈకి అదనపు బాధ్యతలు
జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్సు సీఈగా పని చేస్తున్న నారాయణరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కర్నూలు సీఈగా రాకముందు ఈయన అక్కడే పని చేసే వారు. దీంతో ఖాళీగా ఉన్న ఆ స్థానంలో తిరిగి అదనపు బాధ్యతలు ఆయనకే ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement