విద్యార్థి మృతిపై కలెక్టర్‌సీరియస్
Published Sat, Aug 27 2016 11:32 PM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
ముకరంపుర : కోనరావుపేట గిరిజన ఆశ్రమ పాఠశాల ఏడో తరగతి విద్యార్థి బూక్య స్వామి ఉరివేసుకున్న ఘటనపై కలెక్టర్ నీతూప్రసాద్ తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు, డెప్యూటీ వార్డెన్ ఆంజనేయులును సస్పెండ్ చేసినట్లు ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో కాంట్రాక్టు ఉద్యోగులైన వంట మనిషి జైపాల్, వాచ్‌మెన్ వెంకటేశ్వర్లును విధుల నుంచి తొలగించడంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం విద్యార్థి కుటుంబానికి రూ.5వేలు మంజూరు చేశారు.
Advertisement