టీఆర్‌ఎస్‌లో బయటపడ్డ విభేదాలు
ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.
ఇల్లందు: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టేకులపల్లి మండలం రోళ్లపాడు బహిరంగ సభకు ముఖ్యమంత్రిని స్వాగతిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫొటో లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది.
దీంతో మంత్రి తుమ్మల ఫొటో లేదని ఆరోపిస్తూ ఇల్లందుకు చెందిన తుమ్మల వర్గీయులు ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు.