
పుష్కర ఘాట్ లో మొసలి కలకలం..
ఇబ్రహీంపట్నం : పుష్కర ఘాట్లో మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి బాలమ్మరేవు పుష్కర ఘాట్లో గురువారం జరిగింది. పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులు మొసలిని చూడగానే భయాందోళలనకు గురయ్యారు. దీంతో కొద్దిసేపు నీళ్లలోకి భక్తులెవరూ దిగలేదు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని వెంటనే మొసలిని పట్టుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.