హైకోర్టును విభజించాలి
♦ ‘బార్ అసోసియేషన్’ ప్రతినిధుల డిమాండ్
♦ వికారాబాద్‌లో రాస్తారోకో
♦ ఏడీజేను అడ్డుకున్న న్యాయవాదులు
‘‘రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. తెలంగాణలో ఆంధ్రా పెత్తనం కొనసాగించేందుకు ప్రయత్నించడం దారుణం. ఉమ్మడి హైకోర్టును కూడా వెంటనే విభజించాలి. దీనిపై కేంద్రం తక్షణమే స్పందించాలి. న్యాయమూర్తుల నియామకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలి. లేదంటే ఆందోళన తప్పదు.’’
వికారాబాద్: హైకోర్టులో నియామకం చేపట్టనున్న జడ్జీల పోస్టుల్లో తెలంగాణ వారికే అవకాశం ఇవ్వాలని వికారాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపూర్ణ ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి సోమవారం జిల్లా అదన పు న్యాయస్థానం గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఏడీజే కోలా రంగారావును కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయమూర్తుల నియామకాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. దీనికోసం ఈ నెల 6 నుంచి వారం రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపామని పేర్కొన్నారు. ఏడీజేను కోర్టులోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో.. ఆయన తన సెల్ ఫోన్ నుంచి జిల్లా జడ్జి విజేందర్‌కు ఫోన్ చేసి.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘మీ నిరసన కార్యక్రమాన్ని మీరు చేసుకోండి.. కానీ న్యాయమూర్తులను అడ్డుకోవాల్సిన అవసరం లేదు’ అని సూచించారు. దీంతో నిరసనకారులు ఏడీజేను లోనికి వెళ్లనిచ్చారు.
స్తంభించిన రాకపోకలు...
కోర్టు ముందు రోడ్డుపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో హైదరాబాద్ - తాండూరు రూట్లో వెళ్లే వాహనాలు రోడ్డుపై బారులుతీరాయి. స్పం దించిన సీఐ రవి ట్రాఫిక్‌ను నియంత్రించే నేపథ్యంలో వాహనాలను రాజీవ్‌కాలనీ సమీపంలోని రిక్షా కాలనీ నుంచి అనంతగిరిపల్లి మీదుగా పట్టణంలోకి వచ్చే విధంగా దారి మళ్లించారు. ఎట్టకేలకు న్యాయవాదులకు నచ్చజెప్పి నిరసన కార్యక్రమం ఆపేలా చేశారు. అనంతరం న్యాయవాదులందరూ చలో హైకో ర్టు కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ కా ర్యక్రమంలో న్యాయవాదులు అశోక్, కో ల్‌కుంద సంతోష్‌కుమార్, యాదవరెడ్డి, బస్వరాజ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, మాధవరెడ్డి, శుభప్రద్‌పటేల్, లక్ష్మణ్, శేఖర్,ర వి, శ్రీనివాస్, చంద్రశేఖర్, శంకర్, రఫీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.