ధర్మసాగర్ వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది
-
స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజయ్య
ధర్మసాగర్ : ధర్మసాగర్ మండలం యథావిధిగా వరంగల్ జిల్లాలోనే కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని బుధవారం ధర్మసాగర్ మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ వీరన్న, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే రాజయ్యను హన్మకొండలోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జనగామ జిల్లా ఏర్పాటు ను మాత్రమే సమర్థించినట్లు తెలిపారు. లింగాలఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి మండలాల ప్రజల అభిప్రాయాలను గౌరవించి జనగామ జిల్లాలో కలపాలని కోరినట్లు పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘానికి తాను ఇచ్చిన లేఖలో విషయా న్ని వక్రీకరించొద్దన్నారు. ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాలు వరంగల్ జిల్లాలోనే కొనసాగుతాయని చెప్పారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చాడ నర్సింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుర్రపు ప్రసాద్, బీజేపీ నాయకుడు కొలిపాక రమేష్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.