ప్రజలను నష్టపెట్టే కష్టపెట్టే పాలన ఎప్పటికీ చేయోద్దని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్నం: ప్రజలను నష్టపెట్టే కష్టపెట్టే పాలన ఎప్పటికీ చేయోద్దని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పదిహేను నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజల గురించిన ఆలోచన వచ్చిందని అన్నారు. భూసేకరణ నోటిఫికేషన్ తనకు తెలియదని మంత్రి నారాయణ అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఏపీలో పాలన ఎంత దిగజారిందో రుజువు చేసేందుకు మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. ఇక నుంచైనా పిచ్చితుగ్లక్ నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు.