ప్రతీ మున్సిపాలిటీలో ఈ–పాలనను తప్పకుండా చేపట్టాలని, బ్లాక్‌స్పాట్ గుర్తింపు జరగాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్, కర్నూలు జిల్లా నోడల్ అధికారిణి రమారమణి పేర్కొన్నారు.
మున్సిపాలిటీల్లో ఈ- పాలన
Published Sat, Apr 29 2017 12:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
–మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ రమారమణి
ఎమ్మిగనూరు: ప్రతీ మున్సిపాలిటీలో ఈ–పాలనను తప్పకుండా చేపట్టాలని, బ్లాక్‌స్పాట్ గుర్తింపు జరగాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్, కర్నూలు జిల్లా నోడల్ అధికారిణి రమారమణి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో బ్లాక్ స్పాట్ గుర్తింపుతో సెక్రటరేట్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం జరుగుతోందన్నారు. అదే విధంగా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు–నగర పంచాయతీల్లో తప్పనిరిగా ఈ–పాలన, బ్లాక్‌స్పాట్ ఐడెంటిఫికేషన్ జరగాలన్నారు. సమీక్షలో అసిòస్టెంట్ నోడల్ అధికారి శంకర్‌రావు, కమిషనర్ సంపత్‌కుమార్, మేనేజర్ రంగస్వామి, టీపీఓ నాగరాజు, ఆర్వో రంగన్న, ఏఈ ఆదినారాయణరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement