e-Governance
-
AP: ఈ–గవర్నెన్స్‌లోనూ అదుర్స్
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశవ్యాప్తంగా ఈ–గవర్నెన్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్–10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలతో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 109.27 కోట్లతో రెండో స్థానంలోనూ.. 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అదే ఏపీలో 52.90కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యకమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఆరు కేటగిరీలుగా ఎలక్ట్రానిక్ సేవలు ఇక ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా నివేదిక వర్గీకరించింది. చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, బిజినెస్ సిటిజన్ సేవలు, సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో చట్టబద్ధత, చట్టబద్ధతలేని సేవల లావాదేవీలు 4.16 కోట్లని నివేదిక పేర్కొంది. ఇక యుటిలిటీ బిల్లుల చెల్లింపుల లావాదేవీలు 10.76 కోట్లు.. సమాచార సేవల లావాదేవీలు 4.13 కోట్లు.. సామాజిక ప్రయోజనాల లావాదేవీలు 33.83 కోట్లు.. బిజినెస్ సిటిజన్ సేవల లావాదేవీలు 23 వేలు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానంలోనే ఏపీలో పాలన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్యదర్శులను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే కొనసాగుతోంది. ప్రజలకు అన్ని సేవలను ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే ప్రభుత్వం నిర్వహిస్తోంది. నవరత్నాల్లోని పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా నివేదిక వర్గీకరించింది. దీంతో ఈ–గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించినట్లు నివేదిక వెల్లడించింది. -
దేశంలోనే బెస్ట్ మంత్రిగా కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. 2003 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు మెరుగైన పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనం తర్వాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్.. కొచ్చర్ తరఫున ఈ నెల 23న కేటీఆర్‌కు ఈ అవార్డును అంద జేశారు. ‘ఐటీ సాంకేతికత వినియోగం ద్వారా పౌర సేవలను మెరుగు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా కోవిడ్–19 సమయంలో పౌర సేవలను అందించడంలో ఆధునిక టెక్నాలజీ జీవన రేఖగా నిలిచింది. ఈ విషయంలో అత్యంత శ్రద్ధ చూపిన కేటీఆర్‌కు 2020లో అవార్డు దక్కింది. 2016లోనూ కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు స్కోచ్ అవార్డును అందుకున్న ఏకైక మంత్రి కేటీఆర్’ అని కొచ్చర్ వ్యాఖ్యానించారు. తనకు అవార్డు లభించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్.. ఈ గవర్నెన్స్‌లో 2019 స్కోచ్ ర్యాంకింగ్‌లో పదో స్థానంలో నిలిచిన తెలంగాణ, 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో ఎనిమిదో స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుత ర్యాంకింగ్‌లో మహారాష్ట్రతో కలిసి రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ర్యాంకింగ్‌కు సంబంధించి మదింపు ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరును కూడా మదింపు చేస్తామని స్కోచ్ అవార్డు కమిటీ పేర్కొంది. Delighted to share that Telangana IT Minister @KTRTRS has been awarded the SKOCH “Best Performing IT Minister” Award for the year 2020. Also, Telangana state has been awarded “e-Governance State of the Year” award by @skochgroup. pic.twitter.com/orV0dWO1AW — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2021 -
ప్రభుత్వ డేటాకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: సైబర్ సెక్యూరిటీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ–గవర్నెన్స్‌లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేశామని, ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏడాదిలోగా ఈ ఎస్డీసీని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రభుత్వమే సొంతంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా డేటా భద్రతతో పాటు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం డేటా నిర్వహణకు ప్రైవేటు సంస్థ నుంచి క్లౌడ్ సర్వీసులు వినియోగించుకుంటే ఐదేళ్ల కాలానికి రూ.795 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, అదే ఎస్డీసీ ద్వారా ఈ వ్యయాన్ని రూ.570 కోట్లకు పరిమితం చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చిలోగా ఎస్డీసీలోకి.. డేటా భద్రతకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న అప్లికేషన్లను ఏపీఎస్డీసీలోకి మార్చి 31లోగా బదలాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 32కు పైగా ప్రభుత్వ విభాగాలు ఈ గవర్నెన్స్‌లో భాగంగా బయట సంస్థలు అభివృద్ధి చేసిన అప్లికేషన్లు, హోస్టింగ్ డేటా వినియోగించుకుంటున్నట్లు ఏపీటీఎస్ గుర్తించింది. ఈ అప్లికేషన్లకు సంబంధించి సెక్యూరిటీ ఆడిటింగ్ చేసి, మార్చి 31లోగా ఎపీఎస్డీసీలోకి మార్చనున్నారు. అలాగే ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న ఐటీ అప్లికేషన్లు, వెబ్సైట్లు, యాప్‌ల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను కూడా జారీ చేసింది. -
ఎన్ఐసీపై సైబర్ దాడి
న్యూఢిల్లీ: కీలక కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)కు చెందిన కంప్యూటర్లపై మాల్వేర్ దాడి జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఎన్ఐసీ ప్రధాన విధుల్లో ప్రభుత్వానికి సంబంధించి సైబర్ రంగంలో మౌలిక వసతుల కల్పన ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర ప్రభుత్వ సంస్థలకు ఈ విభాగం ఈ –గవర్నెన్స్‌లో నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఎన్ఐసీకి చెందిన దాదాపు 100 కంప్యూటర్లపై ఈ సైబర్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి, ఎన్ఐసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘ఎన్ఐసీ ఉద్యోగి ఒకరికి, తన అధికారిక మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్ చేయడంతో ఆ ఉద్యోగి కంప్యూటర్లోకి మాల్వేర్ చొరబడింది’ అని శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దాంతో ఆ ఉద్యోగి తన పర్సనల్ ఈ మెయిల్‌ను ఉపయోగించలేకపోయాడని, ఆ తరువాత పలువురు ఇతర ఉద్యోగులకు ఇదే సమస్య ఎదురైందని వివరించారు. అయితే, ఆ మాల్వేర్ దాడి వల్ల ఎలాంటి సమాచార నష్టం జరగలేదని ఎన్ఐసీ తెలిపిందన్నారు. ‘ఎన్ఐసీ ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ తొలి వారంలో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. ఆ బగ్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించాం. ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేం’ అని ఆయన వివరించారు. అయితే, బెంగళూరులోని ఒక సంస్థ నుంచి ఆ మాల్వేర్ ఈ మెయిల్ వచ్చినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. నిజానికి అమెరికా నుంచి ప్రాక్సీ సర్వర్ ద్వారా ఆ మాల్వేర్ ఈమెయిల్ బెంగళూరులోని ఆ ఐటీ సంస్థకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైబర్ దాడికి సంబంధించి ఢల్లీ పోలీసు విభాగం అదనపు పీఆర్ఓ అనిల్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ‘గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు తమ కంప్యూటర్లపై దాడికి ప్రయత్నించినట్లు ఎన్ఐసీ గుర్తించింది. సైబర్ ప్రపంచంలో ఇది సాధారణంగా, తరచుగా చోటు చేసుకునే విషయమే. ఈ దాడిని తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా ఎన్ఐసీ గుర్తించి, తదనుగుణంగా సమాచార భద్రతకు చర్యలు తీసుకుంది’ అని మిట్టల్ పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, దేశ పౌరులు, దేశ భద్రతలకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం ఎన్ఐసీ కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. హ్యాకింగ్ చేసి రాష్ట్రపతి, ప్రధాని, ఆర్మీ చీఫ్ సహా అత్యంత ప్రముఖుల డేటాను దొంగలించారని, ఇందులో చైనా సంస్థ హస్తం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్ఐసీ కంప్యూటర్లపై దాడి ఆందోళనకరంగా మారింది. -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్‌కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్‌లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్‌ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
125 కోట్ల మందికి ఆధార్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నాయని తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు 3–4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది. సీఎస్సీల్లో మళ్లీ ఆధార్ ఎన్రోల్మెంట్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో భాగమైన సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సర్వీసెస్ సంస్థ మళ్లీ ఆధార్ రిజి స్ట్రేషన్, సంబంధిత సర్వీసులను ప్రారంభించింది. వచ్చే వారం దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనుంది. ఆధార్ ఎన్రోల్మెంట్, మార్పులు.. చేర్పులు వంటి సేవలు అందించేందుకు .. యూఐడీఏఐతో సీఎస్సీ ఎస్పీవీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.6 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ).. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఆన్లైన్ ప్రభుత్వ సర్వీసులను అందిస్తున్నాయి. డేటా లీకేజీ, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీఎస్సీ ఆధార్ ఎన్రోల్మెంట్ సేవలు రెండేళ్ల క్రితం నిల్చిపోయాయి. -
డిజిటల్ వైపు జీపీలు
సాక్షి, జనగామ: గ్రామ పాలనను మరింత జవాబుదారీతనంగా తీర్చిదిద్దడానికి గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి బిల్లుల చెల్లింపుల వరకు అన్నీ ఆన్లైన్లోనే అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఇ–గవర్నెన్స్ అమలు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారానే పంచాయతీల్లోని పనులను నిర్వహించనున్నారు. డిజిటల్ సేవలపై ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో మరో 20 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చేతి రాతకు చెల్లు చీటీ గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు పర్చుతోంది. అందులో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం–2018ను అమలులోకి తీసుకొచ్చింది. 500 జనాభా కలిగిన గిరిజన తండాతోపాటు శివారు గ్రామాలను సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శిని సైతం నియమించింది. ఇక పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్న మ్యానువల్ విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇ–గవర్నెన్స్ అమలులో భాగంగా డిజిటల్ సేవలను అమలు చేయనున్నారు. గ్రామ పంచాయతీ నుంచి పొందే ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ నుంచే తీసుకునే విధంగా చర్యలను ప్రారంభించారు. ఇక నుంచి ఇ–పంచాయతీ అప్లికేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, పేరు మార్పిడి, లైసెన్సుల జారీ, ఇంటి పన్ను వసూళ్లు, లే–అవుట్ అనుమతులు అన్నీ ఆన్లైన్ ద్వారా జారీచేస్తారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ప్రొగ్రెస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు. ఆన్లైన్లోనే చెక్‌లు.. గ్రామ పంచాయతీలో రాత చెక్కులకు స్వస్తి చెప్పనున్నారు. పాత చెక్కుల విధానానికి చెక్‌పెట్టి పూర్తి పారదర్శకతతో చెక్కులను అందించడానికి డిజిటల్ కీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పాత విధానంతో గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగం అవుతున్నాయనే భావనతో ఈ దిద్దుబాటు చర్యలను చేపట్టారు. ఇది వరకు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చులను చెక్ రూపంలో చెల్లించే వారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసిన చెక్‌ను ట్రెజరీ ద్వారా బ్యాంకుకు పంపించేది. అన్నీ సరి చూసుకున్న తరువాత బ్యాంకు ద్వారా నగదు విడుదలయ్యేది. ఈ విధానం ద్వారా పనులు తక్కువ.. నిధుల వినియోగం ఎక్కువగా ఉండి ప్రజాధనం ఎక్కువగా దుర్వినియోగం అయ్యేది. మారిన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారంగా ప్రతి పైసాకు లెక్క చూపే విధంగా డిజిటల్ కీ అమలు చేయబోతున్నారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. గ్రామంలో చేపట్టిన పనుల వివరాలను ముందుగా ఇ–పంచాయతీ సాఫ్ట్‌వేర్‌లో గ్రామ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను నమోదుచేసిన తరువాత ఆన్లైన్ చేస్తే డిజిటల్ చెక్ బయటకు వస్తుంది. సర్పంచ్, ఉప సర్పంచ్ల సెల్‌నంబర్లకు ఓటీపీ వస్తుంది. డిజిటల్ చెక్‌పై సర్పంచ్, ఉససర్పంచ్ సంతకాలు చేసి కార్యదర్శి ఎస్టీఓకు పంపిస్తారు. అప్పుడు నిధులు విడుదల అవుతాయి. ఏమాత్రం తప్పులు దొర్లినా నిధుల విడుదల చేతికి రావడం కష్టం. ఈ–పంచాయతీ సేవలపై శిక్షణ కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డిజిటల్ సేవలు అమలు చేయబోతున్నాం. ఆన్లైన్లోనే చెక్కులను అందిస్తాం. సంతకాలను స్కాన్ చేసి ఆన్లైన్ చేయాలి. డిజిటల్ సేవలపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చాం. త్వరలో జిల్లాలో ఇ–గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. – డి. వెంకటేశ్వరరావు, డీపీఓ -
ఇక అంతా.. ఈ–పాలన
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్) : ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ –2018 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో ప్రజలకు మెరుగైన వసతుల కల్పనతో పాటు గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు, అధికారులకు పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ–పాలన ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత నెలలో జిల్లాస్థాయి అధికారులతో పాటు డీపీఎంలకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ కల్పించింది. వీరు ఆయా మండలాల్లో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామాన్ని ఇక ఈ–పంచాయతీ దిశగా మార్చేందుకు అధికారులు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 157 కొత్తగా ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ల వారీగా విధులు నిర్వర్తించే వారు. వీరికి గతంలో 171 వరకు కంప్యూటర్లను అందించారు. మూడు, నాలుగు పంచాయతీలకు చొప్పున క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి ప్రజలకు సేవలందించారు. సరైన వేతనాలు లేక పోవడం, శిక్షణ ఇవ్వకపోవడం, జీతాలు సక్రమంగా రాకపోవడంతో చాలా చోట్ల కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో లేరు. దీంతో ఆయా పంచాయతీలకు మంజూరైన కంప్యూటర్లు మూలనపడ్డాయి. మండల కార్యాలయాల్లోనే ఒక గదిని ఏర్పాటు చేసి ఉన్న కొంత మంది ఆపరేటర్లతోనే ఆయా పంచాయతీలకు సంబంధించిన రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. గ్రామ కార్యదర్శులు పంచాయతీల్లో ఉండలేక మండల కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలో నూతనంగా ప్రతీ గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శిని నియమించారు. విధుల్లో చేరిన వారికి కంప్యూటర్లపై అవగాహన ఉంది. వీరికి కంప్యూటర్లను అందుబాటులోకి తెస్తే గ్రామాల్లోనే పారదర్శకమైన పాలన అందించే అవకాశం ఉంది. కొనసాగుతున్న శిక్షణ శిబిరాలు జిల్లాలోని పాపన్నపేట, పెద్దశంకరంపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, కౌడిపల్లి, శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణాలు, బిల్లులు, లేఅవుట్స్, ట్రేడ్‌లైసెన్స్ మంజూరు, రెన్యూవల్స్, ఇతర సిటిజన్ సర్సీసులను ఇకపై ఆన్లైన్ ద్వారానే చేపట్టడంపై నూతన గ్రామ కార్యదర్శులకు ఈ–పంచాయతీలపై శిక్షణ కల్పించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఈ–పంచాయతీపై జిల్లాలోని ఆయా మండలాల్లో పాత, కొత్త గ్రామ కార్యదర్శులకు కలిపి ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ కల్పిస్తున్నాం. ఈ–పంచాయతీ ద్వారానే రాబోయే రోజుల్లో పాలన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో ఆయా పంచాయతీలకు కంప్యూటర్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామకార్యదర్శులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – భానుప్రకాష్, డీపీఎం, మెదక్ -
ఎస్తోనియాలో ముకేశ్ అంబానీ జాయింట్ వెంచర్
టాలిన్/ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఈ–గవర్నెన్స్ విభాగంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ఎస్తోనియా ప్రభుత్వ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తావి కోట్కాతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ–గవర్నెన్స్ సంబంధ సేవలందించేందుకు దీన్ని ఉద్దేశించినట్లు ఎస్తోనియా ఆర్థిక శాఖ సహాయ మంత్రి విల్యార్ లుబి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన తమ దేశంలో ముకేశ్ అంబానీ ఈ–రెసిడెన్సీ కూడా పొందినట్లు ఎస్తోనియా వర్గాలు తెలిపాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగుమతులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పూర్తి చేసినట్లు బ్రిటన్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ వెల్లడించింది. రిలయన్స్, అమెరికాకు చెందిన ట్రైకాన్ ఎనర్జీకి మధ్య ఇది జరిగినట్లు, భారత్‌లో ఈ తరహా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ లావాదేవీ జరగడం ఇదే ప్రథమం అని పేర్కొంది. దీనివల్ల ఎగుమతి పత్రాల ధ్రువీకరణ ప్రక్రియకు పట్టే సమయం వారం, పదిరోజుల నుంచి ఒక్కరోజుకి తగ్గిపోతుందని రిలయన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీకాంత్ వెంకటాచారి తెలిపారు. -
ప్రతి భారతీయుడి దగ్గర ఉండాల్సిన 20 యాప్స్
న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ తదుపరి ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పలు యాప్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో 20 ప్రభుత్వ యాప్స్ తప్పసరిగా ప్రతి ఒక్క భారతీయుడు వాడాల్సి వస్తుందని ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ గాడ్జెట్స్నౌ రిపోర్టు చేసింది. అవేమిటో ఓసారి చూద్దాం.. ఇండియన్ పోలీసు ఆన్ కాల్ యాప్ : సమీపంలో పోలీసు స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జిల్లా కంట్రోల్‌రూం, ఎస్పీ ఆఫీసు నెంబర్లను కూడా అందిస్తుంది. ఈపాఠశాల యాప్ : ఎన్సీఈఆర్టీ ఈ-బుక్స్‌ను ఈ యాప్ ఆఫర్ చేస్తుంది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ, ఎన్సీఈఆర్టీ కలిసి ఈ యాప్‌ను రూపొందించాయి. మొబైల్ ఫోన్లోనే విద్యార్థులకు, టీచర్లకు ఈ-బుక్స్‌ను అందిస్తుంది. ఎంపరివాహన్ యాప్ : మీ డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీని ఇది క్రియేట్ చేస్తుంది. కారు రిజిస్ట్రేషన్ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. సెకండ్-హ్యాండ్ కారు కొనుగోలు చేద్దామనుకునే వారికి ఈ యాప్ ఆ కారు వయసు, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. స్టార్టప్ ఇండియా : స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను తెలుసుకోవచ్చు. డిజిసేవక్ యాప్ : పలు ప్రభుత్వ రంగ పనులకు వాలంటీర్ సర్వీసులు అందజేయడానికి ప్రజలకు అనుమతిస్తోంది. జీఎస్టీ రేటు ఫైండర్ : ఇప్పటికీ జీఎస్టీ రేట్లు గురించి అయోమయంలో ఉన్నారా? అయితే జీఎస్టీ రేటు ఫైండర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలట. పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్ యాప్ ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్ : అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకు రావడంతో ఈ యాప్ ఎంతో కీలకం. ఆధార్, డిజిలాకర్, పేగవర్న్‌మెంట్ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది. ఇంక్రిడెబుల్ ఇండియా యాప్ : ఇది ప్రభుత్వ టూరిజం యాప్. టూర్ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను అందిస్తుంది. ఎంపాస్‌పోర్టు : పాస్‌పోర్టు అప్లికేషన్ స్టేటస్ ట్రాకింగ్, పాస్‌పోర్టు సేవ కేంద్ర లొకేషన్ వంటి పలు సేవలను ఈ యాప్ ఆఫర్ చేస్తుంది. ఎంఆధార్ యాప్ : ఎంఆధార్ యాప్ అనేది మరో ఉపయోగకర యాప్. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ గుర్తింపును స్మార్ట్ఫోన్లలో తీసుకెళ్లడానికి ఈ యాప్ సహకరిస్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ ప్రొఫైల్‌ను షేర్ చేయవచ్చు, చూసుకోవచ్చు. పోస్ట్ఇన్ఫో : పార్సిల్స్‌ను ట్రాక్ చేయడం, పోస్ట్ ఆఫీసు సెర్చ్, పోస్టేజ్ కాల్యుకేటర్, ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్యుకేటర్, ఇంటరెస్ట్ కాల్యుకేటర్ వంటి సౌకర్యాలను ఇది ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారానే పోస్టులలో కట్టే ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. మైగవ్ : మంత్రిత్వ శాఖలకు, దాని సంబంధిత సంస్థలకు ఐడియాలను, కామెంట్లను, సూచనలను ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. విధాన రూపకల్పనలో, ప్రొగ్రామ్ అమలులో కూడా ఈ యాప్ ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. మైస్పీడ్(ట్రాయ్) : మీ డేటా స్పీడ్‌ను కొలిచేందుకు, ఆ ఫలితాలను ట్రాయ్‌కు పంపించేందుకు ఉపయోగపడుతుంది. ఎంకవాచ్(మొబైల్ సెక్యురిటీ సొల్యుషన్స్) : మొబైల్ ఫోన్లకు చెందిన ప్రమాదాలను గుర్తించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ : మీ నగరం, దాని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేందుకు ఈ యాప్ సహకరిస్తుంది. ప్రజా సమస్యలకు సంబంధించిన ఫోటోలను క్లిక్ చేసి, సంబంధిత మున్సిపల్ అథారిటీలకు పంపించవచ్చు. అన్ని అర్బన్ లోకల్ బాడీలకు, ఈ యాప్‌కు లింక్ ఉంటుంది. భీమ్ : యూపీఐ పేమెంట్ అడ్రస్‌లను, ఫోన్ నెంబర్లను, క్యూఆర్ కోడ్లను వాడుతూ నగదును పంపించడానికి, పొందడానికి యూజర్లకు ఈ యాప్ సహకరిస్తుంది. అన్ని దిగ్గజ భారతీయ బ్యాంకులు యూపీఐతో లింక్ అయి ఉన్నాయని, దీంతో ఈ లావాదేవీలు కుదురుతున్నాయి. ఐఆర్సీటీసీ : అత్యంత పాపులర్ ప్రభుత్వ యాప్‌లలో ఇదీ ఒకటి. రైల్వే టిక్కెట్లను ఆన్‌లైన్‌గా బుక్ చేసుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్‌తో ఇది ఇంటిగ్రేట్ అయింది. ఆయ్కార్ సేథు : ఆదాయపు పన్ను విభాగానికి చెందిన పలు సర్వీసులను అందజేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆన్లైన్లోనే పన్నులు చెల్లించడం, ఆన్లైన్ పాన్ దరఖాస్తు చేసుకోవడం, పన్ను కాల్యుకేటర్కు ఇది ఎంతో సహకరిస్తుంది. కిసాన్ సువిధ యాప్ : వాతావరణ అప్డేట్లు, పంటల మార్కెట్ ధరలు తెలుసుకోవడం కోసం వ్యవసాయదారులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. -
సరళతర పాలన.. సులభతర జీవనం
సాక్షి, హైదరాబాద్: పాలనను సరళ తరం చేసి మానవ జీవనాన్ని సులభతరం చేయడమే ఈ–గవర్నెన్స్ ప్రధాన ధ్యేయం కావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి ఇది అత్యవసరమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ–గవర్నెన్స్‌పై జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘కనిష్ట ప్రభుత్వంతో గరిష్ట పాలన అందించడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ–గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఎన్నో విజయాలు సాధించింది. సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్‌కు మూడేళ్ల కింద 2 లక్షల ఫిర్యాదులొస్తే ఈ ఏడాది 16 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 86 శాతం పరిష్కరించాం. ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందనే ఇందుకు కారణం’ అని అన్నారు. ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ పద్ధతి, దస్తా వేజు పత్రాలపై గెజిటెడ్ అధికారుల ప్రమాణీకరణ తొలగింపు, ఇలా కాలం చెల్లిన 1,500కు పైగా నియమాలు రద్దు చేశామని చెప్పారు. తెలంగాణ ‘మీ–సేవ’కు పతకం.. కార్యక్రమంలో జాతీయ ఈ–గవర్నెన్స్ పురస్కారాలను మంత్రి జితేంద్రసింగ్ ప్రదానం చేశారు. 8 కేటగిరీల్లో 19 అవార్డులు అందజేశారు. ప్రతి కేటగిరీలో స్వర్ణ పతకానికి రూ. 2 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం.. రజత పతకానికి రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. తెలంగాణ ‘మీ–సేవా’విభాగానికి రజత పతకం దక్కింది. కార్యక్రమంలో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, డీఏఆర్పీజీ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా, తెలంగాణ అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
'ఈ-గవర్నెన్స్‌లో తెలంగాణ ముందంజ'
సాక్షి, హైదరాబాద్: ఈ- గవర్నెన్స్‌లో తెలంగాణలో ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసీసీ లో ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్ర సహాయమంత్రి సీఆర్ చౌదరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ-గవర్నెన్స్‌తో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించ వచ్చని స్పష్టం చేశారు. పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టీ వ్యాలెట్ ద్వారా సులభమైన పద్ధతిలో లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. పౌరసేవల కోసం ఆర్టీఏ ఎం వ్యాలెట్ అందుబాటులోకి తీసుకువచ్చాం.. కొద్ది రోజుల్లోనే 1.3 మిలియన్ ప్రజలు ఎం వ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వారాల్లో భవనాలకు కూడా అనుమతినిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పోలీస్, రవాణా వ్యవస్థలోనూ చాలా మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా త్వరలో ఇంటింటికి ఇంటర్నెట్ ను అందించబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో ఈ- పాలన
–మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ రమారమణి ఎమ్మిగనూరు: ప్రతీ మున్సిపాలిటీలో ఈ–పాలనను తప్పకుండా చేపట్టాలని, బ్లాక్‌స్పాట్ గుర్తింపు జరగాలని మున్సిపల్ జాయింట్ డైరెక్టర్, కర్నూలు జిల్లా నోడల్ అధికారిణి రమారమణి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో బ్లాక్ స్పాట్ గుర్తింపుతో సెక్రటరేట్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం జరుగుతోందన్నారు. అదే విధంగా జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు–నగర పంచాయతీల్లో తప్పనిరిగా ఈ–పాలన, బ్లాక్‌స్పాట్ ఐడెంటిఫికేషన్ జరగాలన్నారు. సమీక్షలో అసిòస్టెంట్ నోడల్ అధికారి శంకర్రావు, కమిషనర్ సంపత్‌కుమార్, మేనేజర్ రంగస్వామి, టీపీఓ నాగరాజు, ఆర్వో రంగన్న, ఏఈ ఆదినారాయణరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చైనా కన్నా భారత్ దూసుకుపోతోంది...
-
చైనా కన్నా భారత్ దూసుకుపోతోంది...
విశాఖ: అభివృద్ధిలో చైనా కన్నా భారత్ దూసుకుపోతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన సోమవారం ప్రసంగిస్తూ భారత్ ఆర్థికంగా ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. పరిపాలనలో ఈ గవర్నెస్‌కు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్ని రకాల అనుమతులకు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టామన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయని, వనరులను సరైన రీతిలో వినియోగించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని వెంకయ్య అన్నారు. అవినీతిపై ప్రధాని మోదీ యుద్ధం ప్రకటించారని, పెద్దనోట్లన్నీ బ్యాంకుల్లోకి వచ్చేశాయని వెంకయ్య తెలిపారు. నల్లధనం, అవినీతి నిర్మూలనకే మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. మోదీ నిర్ణయం పట్ల పారదర్శకత పెరుగుతోందని వెంకయ్య పేర్కొన్నారు. కాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, డాక్టర్ జితేంద్ర సింగ్, పీపీ చౌదరి, సుజనా చౌదరితో పాటు ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కె.హరిబాబు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. రెండురోజులు పాటు జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో పాటు 1200మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. -
ఈ–గవర్నెన్స్‌కు సహకారం అందిస్తాం
రాష్ట్ర సమాచార అధికారి రామ్మోహన్రావు కలెక్టర్, తహసీల్దార్లతో సమీక్ష హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఈ–గవర్నెన్స్ ప్రాజెక్టు అమలుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సమాచార అధికారి రామ్మోహన్రావు తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా తహసీల్దార్లతో మాట్లాడి, సాంకేతిక వనరుల నిర్వహణలో వారికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి అప్పటికప్పుడు పరిష్కార మార్గాలను సూచించారు. అనంతరం ఎన్ఐసీ సహకారంతో గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల హాజరు కోసం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని జులైవాడలోని ఎస్టీ హాస్టల్లో పరిశీలించారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కేయూ వీసీ సాయన్నను కలిసి వెబ్సైట్ల నిర్వహణకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై చర్చించారు. ఎన్ఐసీ ద్వారా సాంకేతిక సహకారం అందిస్తామని వీసీకి తెలిపారు. ఆయన వెంట టెక్నికల్ డైరెక్టర్ వెంకటసుబ్బారావు, జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్, అదనపు సమాచార అధికారి అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
లక్షకు పైగా ట్యాబ్‌ల కొనుగోలు
* ఇ గవర్నెన్స్, పేపర్‌లెస్ పాలన అంటున్న ప్రభుత్వం * రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్ధం సాక్షి, హైదరాబాద్: రెండువందల కోట్ల రూపాయలకు పైగా వ్యయాన్ని వెచ్చిస్తూ ఏకంగా లక్ష కు పైగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒకవైపు లోటు బడ్జెట్, నిధుల లేమి అని ముఖ్యమంత్రి తరచూ బీద అరుపులు అరుస్తుంటారు. అయితే పాలనపరమైన సౌకర్యం కోసం అంటూ ఇప్పుడు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధం అవుతుండటమే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కీలక ఉద్యోగులందరికీ ఈ ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి గ్రామ, మండల స్థాయి నుంచి ఏ అధికారి అయినా స్మార్ట్ ఫోన్ల ద్వారా టెలిగ్రామ్, వాట్స్‌యాప్ సౌకర్యాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే రాష్ట్రస్థాయి నుంచి క్షేత్ర స్థాయి అధికారులకు ఏ సమాచారం పంపాలన్నా మెయిల్ ద్వారానే పంపించనున్నారు. ఇ-గవర్నెన్స్‌లో భాగంగా ట్యాబ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఒక్కో ట్యాబ్‌కు పది వేల రూపాయల వ్యయం, ఒక్కో స్మార్ట్ ఫోనుకు పది వేల రూపాయల వ్యయం అవుతుందని ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా రెండువందల కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. స్కూళ్లకు 62 వేల ట్యాబ్‌లు దశల వారీగా రాష్ట్రంలోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్‌కు కూడా ట్యాబ్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కూల్స్ అన్నీ కలసి 62 వేలకు పైగా ఉన్నాయి. అంటే మరో 62 వేల ట్యాబ్‌లను కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నారు. -
ఐదేళ్లలో తెలంగాణలో ఎం-గవర్నెన్స్!
ఈ-సేవ కేంద్రాల్లోని సేవలన్నీ మొబైల్స్‌కు మళ్లింపు దీంతో స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వ సేవల వినియోగం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌కు (ఈ-గవర్నెన్స్) స్వస్తి పలికి.. దాని స్థానంలో మొబైల్ గవర్నెన్స్‌ను (ఎం-గవర్నెన్స్) తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెప్పారు. ఐదేళ్లలో ఈ-సేవా కేంద్రాల్లోని 316 సేవలను మొబైల్స్‌కు మళ్లిస్తామన్నారు. దీంతో ప్రభుత్వ సేవలను ఎవరికి వారే తమ స్మార్ట్ఫోన్ల ద్వారా తామే చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. ఎం-గవర్నెన్స్‌కు అవసరమైన టెక్నాలజీని, యాప్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయన్నారు. టై, ఫిక్కీల సంయుక్త ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సొల్యూషన్స్ అండ్ స్మార్ట్ సొసైటీస్’ అనే అంశంపై సోమవారమిక్కడ సదస్సు, శిక్షణ శిబిరం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్మార్ట్ అనేది ప్రభుత్వ పాలనకే పరిమితం కాకూడదని, ట్రాఫిక్ నిబంధనలు, మున్సిపాలిటీ నిర్వ హణ వంటి మౌలిక వసతులన్నీ స్మార్ట్‌గా మారాలని అన్నారు. స్మార్ట్ టెక్నాలజీ సదస్సు... జులైలో అంతర్జాతీయ స్మార్ట్ టెక్నాలజీ సదస్సును నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అనంతరం ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. దేశంలో స్మార్ట్ టెక్నాలజీపై రోజుకు 3,000 పేటెంట్లు బయటికొస్తున్నాయని.. ఇందులో హైదరాబాద్ టెక్నాలజీ డెవలపర్లు, స్టార్టప్స్ తక్కువేం కాదని కొనియాడారు. స్మార్ట్ సిటీ అనేది సింగపూర్, బార్సిలోనా వంటి దేశాలకే పరిమితం కాకుండా ఆ జాబితాలో తెలంగాణనూ చేర్చుతామని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో 60 వేల చ.అ. విస్తీర్ణంలో, 8 వేల సీటింగ్ కెపాసిటీ తో ఉన్న ఇంక్యుబేటర్ సెంటర్‌ను త్వరలోనే లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం స్మార్ట్ హెల్త్, మొబిలిటీ, ఎనర్జీ అనే అంశంపై ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) ప్రెసిడెంట్ సఫిర్ అదేని తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-గవర్నెన్స్’
న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీని వాడే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్యాలయాలనూ ఆ టెక్నాలజీ బాటలో నడిపించనున్నారు. వాటిని కాగితరహితంగా మార్చేందుకు, పారదర్శకత పెంచేందుకు, పనులు వేగవంతంగా చేసేందుకు ‘ఈ-ఆఫీస్’ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టే చర్యలను వేగవంతం చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలకు కేబినెట్ సెక్రటేరియట్ ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఫైళ్ల నమోదు, రసీదులు తదితరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే ఈ-గవర్నెన్స్ ద్వారా చేపడతామని అధికార వర్గాలు తెలిపాయి. -
ఈ-గవర్నెన్స్‌లో రాష్ట్రం ముందంజ
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-గవర్నెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రోత్సాహకరంగా ఉందని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 22 శాఖల పరిధిలో 177 ఈ-గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రభుత్వ సేవలు అందించడానికి ఏడువేల పౌర సేవా కేంద్రాలను నెలకొల్పామని వివరించారు. ‘మీసేవ’ లావాదేవీల్లో గురువారానికి 29 మిలియన్ల మైలురాయిని దాటామని పొన్నాల వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 331 ఈ-గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తేవడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ‘ఇన్నోవేట్(ఆవిష్కరణ), ఇంప్లిమెంట్(ఆచరణ)’ అంశంపై ఢిల్లీలో గురువారం ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సొంత జిల్లా వరంగల్‌ను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేశామని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాన్నీ ‘గూగుల్ మ్యాప్స్’లోకి చేరేలా కృషి చేశామన్నారు. దేశంలోనే ఒక జిల్లా పూర్తిగా డిజిటైజ్ కావడం ఇదే ప్రథమమన్నారు.