కరెంటు మీటర్ల సీల్స్ చోరీ ముఠా అరెస్ట్
బంజారాహిల్స్: కరెంటు మీటర్లకు వేసే సీల్స్‌ను దొంగి లించి వాటిని విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారికి విక్రయిస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బంజారాహిల్స్ డివి జన్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ సామల వెంకట్‌రెడ్డి, డీఐ ముత్తు ఈ ఘట న వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ జీటీఎస్ కాలనీలో ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్స్ గోడౌన్ లో మహ్మద్ నయీం(27) మీటర్ సీల్స్ పను లు చేస్తున్నాడు. ఇతడు కొంతకాలంగా కరెంటు మీటర్లకు వేసే సీల్స్‌ను దొంగిలిస్తున్నాడు. వీటిని ఎలక్ట్రీషియన్లు అయిన మహ్మద్ బాసిత్‌ఖాన్(39), మహ్మద్ నిసార్(32), గులాం సాం దాని(42), మహ్మద్ సాదిక్ హుస్సేన్(43)కు విక్రయించేవాడు. వీరు ఫ్యాక్టరీలు, బడా గోదాములకు ఈ మీటర్ సీళ్లను విక్రయిస్తున్నారు.
ఇలా ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తనకు నెలనెలా లక్షల్లో కరెంటు బిల్లు వస్తుండటంతో మీటర్ సీల్ తొలగించి ముంబయి నుంచి ప్రత్యేకంగా ఎలక్టీషియన్‌ను రప్పించి మీటర్ ను ట్యాంపరింగ్ చేయించి దొంగిలించిన మీట ర్ సీల్‌ను వేశాడు. ఇదిలా ఉండగా, తన కార్యాలయంలో 130 మీటర్ సీళ్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఏఈ మురళీధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు ఏఈ కిందనే పని చేస్తున్న నయీం ఈ పని చేసినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నయీం వద్ద 59 సీల్ బిట్స్ లభించాయి. వాటి ని స్వాధీనం చేసుకుని నయీంతో పాటు ముగ్గురు ఎలక్టీషియన్లు, ఐస్ ఫ్యాక్టరీ మేనేజర్‌ను అరెస్టు చేశారు.
ఎలా పని చేస్తుందంటే: జీటీఎస్‌కాలనీలోని మీటర్ సీల్స్ గోదాంనుంచి నయీం సీళ్లను చోరీచేసి ఒక్కొక్కటి రూ. 500 కు బాసిత్ అనే ఎలక్ట్రీషియన్‌కు విక్రయించేవాడు. బాసిత్ ఐస్ ఫ్యాక్టరీ యజమానికి రూ. 15 వేలకు సీల్ బిట్స్ విక్రయించాడు. ముం బయి నుంచి మీటర్ ట్యాంపరింగ్ చేసే వ్యక్తిని రప్పించి ఒరిజినల్ మీటర్ సీల్ తొలగించి దొం గిలించిన సీల్‌ను వేశారు. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మీటర్ తిరిగేలా దానికి ఎలక్ట్రిక్ రిమో ట్ కంట్రోల్‌ను కూడా బిగించారు. మొత్తం 130 సీళ్లు చోరీ కాగా, వాటిలో 59 మాత్రమే పోలీసులకు చిక్కాయి. మిగతావి ఎక్కడ బిగించారో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.