విజయనగరం మున్సిపాలిటీ: గృహావసరాలకు వే సిన విద్యుత్ మీటర్లు ఎన్నో ఏళ్ల కిందట అమర్చినవి కావడం.. పాత విద్యుత్‌మీటర్లు సక్రమంగా తిరగకపోవడం, వాటిపై అవగాహన ఉన్న వారు వాడుకున్న విద్యుత్‌కు మీటర్లు తిరగకుండా నిలిపివేసే విధంగా జాగ్రత్తలు పడడం వల్ల భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతున్నట్లు విద్యుత్‌శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఎటువంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. సంస్థ పరిధిలో
నష్టాలను అధిగమించేందుకు ఇప్పటివరకు ఉన్నవిద్యుత్‌మీటర్ల స్థానంలో ఇంటిగ్రేటెడ్ రిమోట్ పోర్టబులిటీ ఆపరేటింగ్ విద్యుత్‌మీటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమాలకు తావుండదు. ఈ విషయంలో మీటర్‌రీడర్స్ చేతి వాటం ప్రదర్శించేందుకు వీలుండదు. రిమోట్ కంట్రోల్ సిస్టమ్‌లో విద్యుత్ మీటర్‌కు మీటరు దూరం నుంచే రీడింగ్ ఆటోమేటిగ్గా లెక్కకట్టి బిల్లు వస్తుంది. నెలలో వినియోగించిన మొత్తం యూనిట్లకు బిల్లు నమోదవుతుంది. అంతేకాకుండా అధిక మొత్తంలో బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. పలువురు రూ.వేలల్లో విద్యుత్‌ను వినియోగించి మీటర్‌లను కాల్చివేయడంతో ఆ బిల్లును ఎగవేయాలని భావిస్తారు. అవసరమైతే మీటరు కోసం గతంలో రూ.200 చెల్లించి చేతులు దులుపుకునే వారు. అయితే ఐఆర్‌పీ మీటర్‌లతో అలాంటి ఆటలకు ఆస్కారం ఉండదు.
దరఖాస్తు చేస్తే కొత్త మీటర్: సంస్థ పరిధిలో ఉన్న మొత్తం 5 లక్షల 97వేల, 977 సర్వీసులు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా.. అందులో హెచ్‌టీ సర్వీసులకు సంబంధించి ఇప్పటికే హై అక్యురసీ విద్యుత్‌మీటర్లు ఏర్పాటు చేశారు. తాజాగా గృహావసర, కమర్షియల్ సర్వీసులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రిమోట్ పోర్టబులిటీ విద్యుత్‌మీటర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త మీటర్లను అమర్చుతుండగా..పాత మీటర్లు ఉన్న జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో మార్పు చేయను న్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 42వేల 117 గృహావసర, కమర్షియల్ సర్వీసులకు సంబంధించిన విద్యుత్ మీటర్లు మా ర్పు చేయాల్సి ఉండగా..అందులో లక్షా 93వేల 819 మీటర్లను మార్పు చేశారు.
ఈ ప్రక్రియ తొలిసారిగా ప్రారంభించిన సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో 80 శాతం పూర్తికాగా.. విజయనగరం పట్టణంలో ఈనెల నుంచి ప్రారంభించారు. తరువాత క్రమంలో గ్రామ పంచాయతీల్లో మార్పు చేయనున్నారు.
జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రక్రియ: ఈప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో గల ఐదు జిల్లాలను ఐదు సర్కిళ్ల కింద విభజించగా.. అందులో ఏలూరు సర్కిల్‌లో 38.72 శాతం, తూర్పుగోదావరి స ర్కిల్‌లో 34.70 శాతం, శ్రీకాకుళం సర్కిల్‌లో 34.66 శాతం, విశాఖ సర్కిల్ పరిధిలో 34.78 శాతం, విజయనగరం సర్కిల్ పరిధిలో 35.75 శాతం పూర్తిచేసినట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు తెలిపారు.
ఈ మీటర్..మీ మాట వినదు
Published Thu, Sep 3 2015 11:44 PM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement
Advertisement