తాడిమర్రి : మండలంలో గతంలో జరిగిన బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. గత ఏడాది క్రితం రెవెన్యూ అధికారులు స్థానిక బ్యాంక్‌ల్లో సోదాలు చేయగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 39, సహకార సంఘం బ్యాంక్‌లో 15 మొత్తం 54 బోగస్ పుస్తకాలను గుర్తించారు. దీంతో బోగస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు కొందరు వీఆర్‌ఓలపై కేసులు నమోదు చేశారు. గత నెలలో సీఐడీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు.
కాగా శనివారం సీఐడీ సీఐ సీఎస్‌హెచ్ గౌస్, ఎస్‌ఐ ఇబ్రహీంలు గతంలో తాడిమర్రి వీఆర్‌ఓగా పని చేసిన కాటమయ్య, అగ్రహారం వీఆర్‌ఓగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన విశ్వమూర్తిని విచారించారు. బ్యాంక్ తనిఖీల్లో లభించిన పట్టాదారు పాసుపుస్తకాల మేరకు వన్‌బీ, అడంగల్, డైక్లాట్ తదితర రికార్డులను పరిశీలించారు. ఎవరెవరికి ఎన్ని పుస్తకాలు పంపిణీ చేశారు? పుస్తకాలు ఎక్కడ నుంచీ సేకరించారు? ఎన్ని ఎకరాల విస్తీర్ణం పంపిణీ చేశారు? అనే విషయాలపై విచారించారు. తదుపరి విచారణలకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని సదరు వీఆర్‌ఓలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఆదెప్ప, వీఆర్‌ఓలు వీరూపాక్షప్ప,రామకృష్ణ పాల్గొన్నారు.
బోగస్ పాసుపుస్తకాలపై విచారణ
Published Sun, Aug 28 2016 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement