అనంతపురం సిటీ : ప్రభుత్వాస్పత్రిలో ప్రసవమైన తల్లిని, బిడ్డనూ వారి ఇంటికి ఉచితంగా చేర్చేందుకు ప్రవేశపెట్టిన ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనంలో అనధికారికంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ‘నయా దోపిడీ’ పేరుతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి జీవీకే సంస్థ ్థ రీజినల్ మేనేజర్ అంజనరెడ్డి మంగళవారం స్పందించారు. ఈ మేరకు అనంతపురం ఇన్‌చార్జ్ మోహన్‌ను ఈ సంఘటనపై ఆరా తీసిన అధికారులు అనంతరం డ్రైవర్లను ఆర్‌ఎంఓ వెంకటేశ్వరరావు వద్దకు పంపారు.
ఆస్పత్రి తరఫున వచ్చే రోగులకు ఉచితంగా అందివ్వాల్సిన సేవలకు చార్టీలు వసూలు చేయరాదన్నారు. ఎవరైనా వసూలు చేసినట్లు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జీవీకే సంస్థ రీజనల్ మేనేజర్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జి మోహన్‌లు గుత్తికి వెళ్లి అనధికారికంగా డబ్బు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై బాధిత కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలిసింది. విచారణ పూర్తికాగానే తగు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ దందాపై విచారణ
Published Wed, Aug 3 2016 1:11 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement