ఆర్థిక సమస్యల ఒత్తిడితో వడ్డే తిమ్మప్ప (45) అనే రైతు గుండెపోటుకు గురై మృతి చెందాడు.
కళ్యాణదుర్గం : ఆర్థిక సమస్యల ఒత్తిడితో వడ్డే తిమ్మప్ప (45) అనే రైతు గుండెపోటుకు గురై మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం మునిసిపాలిటీ పరిధిలోని ముదిగల్లుకు చెందిన తిమ్మప్ప, గంగరత్నమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె భాగ్యమ్మకు వివాహం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు మురళి ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులను ఆపేశాడు. రెండో కుమారుడు విష్ణు ఇంటర్ చదువుతున్నాడు. తిమ్మప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు పరిస్థితుల నేపథ్యంలో వరుసగా పంటలు నష్టపోయాడు. కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులు చేశాడు. ఇలా చేసిన అప్పులు దాదాపు రూ.3లక్షలకు చేరుకున్నాయి. అప్పులు ఎలా కట్టుకోవాలో.. పిల్లలను ఎలా చదివించాలోననే ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.