రైతుల రాస్తారోకో | farmers rastha rocco | Sakshi
Sakshi News home page

రైతుల రాస్తారోకో

Published Thu, Dec 8 2016 11:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతుల రాస్తారోకో - Sakshi

రైతుల రాస్తారోకో

ఎమ్మిగనూరు రూరల్: నగదు కోసం ఎమ్మిగనూరు పట్టణంలో రైతులు రాస్తారోకో చేశారు. డబ్బులు ఇవ్వలేనప్పుడు బ్యాంకును మూసుకోవాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక కార్పొరేషన్‌ బ్యాంకుకు గురువారం రైతులు భారీగా తరలివచ్చారు. డబ్బులేదని చెప్పడంతో తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలకు డబ్బులు ఎలా ఇవ్వాలని అధికారులను నిలదీశారు. శివ సర్కిల్‌ సమీపంలో రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎస్‌ఐ వేణుగోపాల్, ఏఎస్‌ఐ కృష్ణారెడ్డి, పోలీసులు అందోళనను విరమింప చేయించటానికి నానా కష్టాలు పడ్డారు.  బ్రాంచి మేనేజర్‌తో మాట్లాడగా..డబ్బులు రాలేదని, టోకెన్లు ఇస్తామని బ్యాంకుకు డబ్బు వస్తే అందరకి ఇస్తారని చెప్పటంతో శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement