పరిగి మండలం కొడిగెనహళ్లిలో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి తండ్రి బిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
పరిగి (పెనుకొండ) : పరిగి మండలం కొడిగెనహళ్లిలో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లి తండ్రి బిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే కొడిగెనహళ్లికి చెందిన అక్కులప్ప సోమవారం పండుగ కావడంతో ఉదయం తమ స్వగ్రామంలో పండుగ చేసుకుని ఇంటిలో ఉన్న చిన్న వినాయక విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి వెళ్లారు. నిమజ్జనం చేసే ప్రక్రియలో కుమార్తె చందన (8) కాలు జారి గుంతలోకి పడింది. కుమార్తెను రక్షించే ప్రక్రియలో నీటిలో వేగంగా దూకిన అక్కులప్ప బురదలో చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు వదిలాడు.
ప్రమాదాన్ని కళ్లారా చూసిన కుమారుడు అభిషేక్ కేకలు వేస్తూ నీటిలోకి దూకడంతో ప్రమాదాన్ని గ్రహించిన కొందరు పరుగున వచ్చి బాలుణ్ణి బయటకు తీసి Ðð ంటనే పాపను, తండ్రి అక్కులప్పను బయటకు తీశారు. అప్పటికే ఆయన మరణించగా కొన ఊపిరితో ఉన్న చందనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. సమాచారం అందగానే కుటుంబసభ్యులు, బంధువులు గ్రామస్థులు పెద్ద ఎత్తున చెరువుకు చేరుకుని రోధించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.