కడప కోటిరెడ్డి సర్కిల్ : రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం సాగిస్తామని రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఓబుల్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాలలో రాయలసీమ వెనుకబడి ఉందని, ఇందుకోసం రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు చేశామని, ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం జనార్దన్ మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర కమిటీ అధ్యక్షులుగా ఉరిమి జనార్దన్, కో కన్వీనర్‌గా దావుద్దీన్, చంద్రమోహన్‌రెడ్డి, సభ్యులుగా కుమార్, శివ నాయక్, శ్యాంసన్, ముక్తియార్‌బాష, రవి చక్రవర్తి, రమేష్, వెంకటరాజు, గంగన్న, ఈశ్వరయ్య, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, నాగార్జుననాయక్, సుబ్బరాయుడులను ఎన్నుకున్నారు.