టీ‘ఢీ’పీ
జిల్లా తెలుగుదేశంలో గ్రూపుల పోరు
పనులు, పదవుల కోసం పోటీ
పరాకాష్టకు చేరుతున్న వివాదాలు
తలపట్టుకుంటున్న అధిష్టానం
జిల్లా టీడీపీలో గ్రూపుల పోరు పెరిగింది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారస్థారుుకి చేరింది. పదవుల కోసం, పనుల కోసం నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో వర్గ పోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పలు చోట్ల మంత్రుల ముందే ‘నువ్వెంతంటే..నువ్వెంతన్న’ స్థారుులో మాటల యుద్ధాలు, వాగ్వాదాలు నెలకొన్నారుు. జనచైతన్య యాత్రల్లోనూ ఇవి బయటపడ్డారుు. దీంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడిం ది. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని జిల్లా పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
తిరుపతి : గత ఎన్నికల్లో టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాల్లోనూ, వైఎస్సార్‌సీపీ 8 చోట్లా గెలుపొందారుు. సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో కొద్ది మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కింది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లాపై దృష్టి పెట్టారు. నామినేటెడ్ పదవులిస్తాననీ, పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తాననీ, కాంట్రాక్టు పనులిప్పిస్తామని హామీలిచ్చారు. చాలా నియోజకవర్గాల్లో ఇలాంటివేమీ జరగలేదు. దీంతో పట్టణ, మండల స్థారుు నాయకుల్లో పార్టీపై అసంతృప్తి మొదలైంది. పదవులున్న వారు ఏదో ఒక రకంగా ఎదుగుతుంటే తొలినుంచీ పార్టీ జెండా మోసిన నాయకులకు ప్రాధాన్యత లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. ఈ నేపథ్యంలో కుమ్ములాటలు మొదలయ్యారుు. చిత్తూరు, నగరి, మదనపల్లి, తంబళ్లపల్లి, శ్రీకాళహస్తి, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నారుు.
చిత్తూరులో టీడీపీ నాయకుల మధ్య వర్గ రాజకీయాలు నెలకొన్నారుు. ప్రధానంగా ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రజాప్రతినిధికి, మరో సామాజిక వర్గానికి చెందిన నాయకులకూ నడుమ సఖ్యత లేకుండా పోరుుంది. కార్పొరేషన్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని కుమ్ములాడుకుంటున్నారు. కార్పొరేషన్ లోని పలు పనులను తాము చెప్పిన వాళ్లకే ఇవ్వాలని ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. కార్పొరేషన్‌లో ఇటీవల డిప్యూటీ ఇంజనీరును టీడీపీ చెందిన ఓ సామాజిక వర్గ నాయకులు మాతృశాఖకు సరెండర్ చేరుుంచారు. తనకు తెలియకుండా వ్యవహారం నడవడంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధి, సదరు డీఈఈని మళ్లీ చిత్తూరు కార్పొరేషన్‌కే తెప్పించుకున్నారు. గంగనపల్లె డివిజన్ ఉప ఎన్నికల విషయంలోనూ ఇది ప్రస్ఫుటమవుతోంది.
నగరిలో ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడుతో పాటు ఆయన కుమారులు నియోజకవర్గంలో తిరుగుతున్నా పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలను అదుపు చేయలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాతినిధ్యం ఇస్తున్నారని తమకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని సీనియర్ నాయకులు అలకవహించిన సందర్భాలు కూడా ఉన్నారుు. పట్టణ టీడీపీ అధ్యక్షునికీ, ఎమ్మెల్సీకి మధ్య విభేదాలు ఏర్పడి పార్టీ పట్టణ అధ్యక్షున్ని తొలగించినట్లు ఆ పార్టీ పరిశీలకుడు ప్రకటించడం, ఆ తర్వాత కొందరు నాయకుల సంప్రదింపులతో వారిని పార్టీలో కలుపుకోవడం లాంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నారుు. పుత్తూరు మున్సిపాలిటీ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యులు తమ వార్డులకు నిధులు కేటారుుంచలేదంటూ తలుపులు వేసుకొని చైర్మన్‌తో కాంట్రాక్టుల విషయంలో వాగ్వాదాలకు దిగడం పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని తెలియజేస్తోంది. మున్సిపల్ పీఠంపై ఒప్పందాన్ని కాదని ఒకరినే కొనసాగిస్తుండటం విభేదాలకు ఆజ్యం పోస్తోంది.
తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో ముదివేడుకు చెందిన ఓ మాజీ సర్పంచు, ఓ మండలస్థారుు ప్రజాప్రతినిధి, పార్టీ మండల నేత ఈ ముగ్గురే అభివృద్ది పనులన్నీ చేస్తుండటంతో టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. బి.కొత్తకోట మండలంలో అభివృద్ధి పనులన్నీ కొందరికే కట్టబెట్టారంటూ నెలక్రితం జరిగిన పార్టీ మండలస్థారుు సమావేశంలో పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటూ.. ఆరోపణలు చేసుకున్నారు. పెద్దమండ్యం మండలంలో పార్టీ మండల నేత, మరో నాయకుడి మధ్య వర్గపోరు సాగుతోంది. ములకలచెరువు మండలంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరు సాగుతోంది. అంగన్ వాడీ పోస్టులు, నీరు-చెట్టు పనుల కోసం గొడవలు పడ్డారు. తంబళ్లపల్లె మండలంలోనూ ఇదే తీరు. ఎమ్మెల్యే శంకర్‌పై పార్టీ అధినేత తనయుడు లోకేష్ బాబుకు ఫిర్యాదు చేసేందుకు అసంతృప్తి నాయకులు నిర్ణరుుంచారు.
పలమనేరులో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తొలినుంచీ ఈయన ఆగమనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుభాష్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు.