
చిత్తూరు లో కాల్పుల కలకలం
పెనుమూరు: ఇంటిముందు కూర్చున్నఓ సాప్ట్ వేర్ ఇంజినీర్, అతని తండ్రి పై తెలియని కొంతమంది దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈఘటన చిత్తూరులోని పెనుమూరు క్రాస్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మురుగా రెడ్డి ఆయన కుమారుడు దినేష్ పై గుర్తుతెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దినేష్ ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దినేష్ బెంగళూరులో రెండేళ్లు నుంచి సాప్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. దుండగులు బెంగళూరు కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.