
సాక్షి, చిత్తూరు : చంద్రగిరి మండలం చర్లపల్లెలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. వివరాలు... డిజిటల్ క్లాసులు ఉన్నాయని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు డిజిటల్ గదికి చేరుకున్నారు. అయితే అక్కడ ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో యాసిడ్ బాటిల్స్ కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని మొదట తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసమని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment