రైతులతో మాట్లాడుతున్న కోల్‌హట్కర్
జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంతంలో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత పథకం అమలవుతున్న విధానాన్ని పథకం సలహాదారు డాక్టర్ కోల్ హట్కర్ పరిశీలించారు. శనివారం అర్జున్ నాయక్ తండాలోని భూములను పరిశీలించారు. ఈ పథకం అమలవుతున్న తీరును చూశారు.
రైతులు శేనిబాయి, రాజీబాయి పొలాల్లోని పంటలను పరిశీలించి, ఈ పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. చిరుధాన్య పంటలైన కొర్ర, సజ్జ, జొన్న, సామ వంటి పంటలను సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న డీడీఎస్ రైతులతో మాట్లాడారు. పంటలను సాగు చేస్తున్న విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పస్తాపూర్‌లోని డీడీఎస్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ వీపీ సతీష్‌తో సమావేశమయ్యారు.
ఆయన వెంట జాతీయ ఆహార భద్రత పథకం జిల్లా సలహాదారు రాజిరెడ్డి, జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్, ఏఓ ప్రవీణ, కేవీకే శాస్ర్తవేత్త వరప్రసాద్, డీడీఎస్ మహిళా రైతులు సమ్మమ్మ, చంద్రమ్మ, లక్ష్మమ్మ, అనుసూయమ్మ, అర్జున్‌నాయక్ తండా రైతులు అమీర్‌బాయి, చాందిబాయి, డీడీఎస్ ప్రతినిధులు తేజస్వి, మంజుల, నర్సమ్మలు పాల్గొన్నారు.