జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపు
పాణ్యం చెంచుకాలనీలో స్టేడియం ప్రారంభం
పాణ్యం: చెంచులు అన్ని రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి సాధించాలని జిల్లా ఎస్పీ అకే రవికృష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రం పాణ్యం చెంచుకాలనీలో నూతనంగా నిర్మించిన సో్పర్ట్స్ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెంచులకు క్రీడలపై ఆసక్తి పెంచాలని సే్టడియాన్ని నిర్మించి క్రీడాపరికరాలు ఇస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాల్లో గిరిజన కుటుంబాలకు సరైన విద్య అందడం లేదని చెప్పారు. సారా తయారీ, ఇతర అలవాట్లను వీడి పిల్లలను బాగా చదివించుకోవాలని గిరిజనులకు సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇక నుంచి చెంచు కాలనీలో ప్రతి రోజు ఉదయం ఒక పోలీస్ అధికారి పర్యటించి పిల్లలు ఇళ్ల వద్ద కనిపిసే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఒకరిని ఉద్యోగుడిగా చూడాలని ఉందన్నారు. త్వరలో జరిగే జాబ్‌మేళాకు గిరిజన యువకులు హాజరుకావాలని కోరారు. అనంతరం చెంచు యువతకు క్రీడా దుస్తులను అందించారు. అంతకుముందు చెంచులు ఎస్పీని ఘన స్వాగతం పలికి సత్కరించారు. వీటీడీఏ ప్రెసిడెంట్, పాణ్యం మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, జెడ్‌పీటీసీ నారాయణమ్మ, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, పాణ్యం ఉపసర్పంచ్ ఆటోమాబు, పాణ్యం ఎస్‌ఐ మురళీమోహన్‌రావు, గడివేముల ఎస్‌ఐ రామాంజినేయరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నాగశేషు, జాకీర్ ఉసేన్, హోటల్ బాబు, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.