పాడి రైతుల పొట్టకొడితే ఊరుకోం | formers are angry for milk rate reduce | Sakshi
Sakshi News home page

పాడి రైతుల పొట్టకొడితే ఊరుకోం

Published Sat, Aug 13 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రైతులు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రైతులు

–హె రిటేజ్‌ నిర్వాహకులపై మండిపాటు
– లీటర్‌కు రూ. 35 ఇవ్వాలని డిమాండ్‌
చిత్తూరు(రూరల్‌) : పాల ధరను హెరిటేజ్‌ డెయిరీ నిర్వాహకులు దారుణంగా తగ్గించారని, ఇలా చేస్తే తాము ఊరుకునేది లేదని ఆ డెయిరీకి సంబంధించిన పలువురు రైతులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఎన్నో ఏళ్ల నుంచి తాము  హెరిటేజ్‌ డెయిరీకి పాలు పోస్తున్నామని తెలిపారు. ఆ డెయిరీ నిర్వాహకులు కొన్ని నెలలుగా పాలు లీటర్‌పై రూపాయి..అర్ధరూపాయి తగ్గించి ఇస్తూ వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం లీటర్‌కు రూ. 21 మాత్రమే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. పాడి రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డెయిరీనే ఈ విధంగా చేస్తే మిగతా డెయిరీల పరిస్థితి ఏమిటని  ప్రశ్నించారు. ఇప్పటికైనా డెయిరీ నిర్వాహకులు స్పందించాలని, పాలు లీటర్‌కు రూ. 35 చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో రైతులు నాగేశ్వర్‌రెడ్డి, హరిబాబు, బాబునాయుడు, భాస్కరనాయుడు, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement