పోచంపల్లి బ్యాంక్‌కు 4 జాతీయ అవార్డులు
పోచంపల్లి బ్యాంక్‌కు 4 జాతీయ అవార్డులు
Published Mon, Sep 19 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
భూదాన్‌పోచంపల్లి : 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు వచ్చినట్లు ఆ బ్యాంకు ౖచెర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, సీఈఓ సీత శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు ప్రతి ఏటా బ్యాంకింగ్ ప్రాంటియర్స్ ముంబయి ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులు కేటాయిస్తుందన్నారు. ఇందులో భాగంగా పోచంపల్లి బ్యాంక్‌కు బెస్ట్ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్, బెస్ట్ కార్డ్ ఇన్సిషియేట్, బెస్ట్ వెహికల్ లోన్ అచీవ్‌మెంట్, బెస్ట్ ఏటీఎం అక్వైరర్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమ్మేళనం–16లో అవార్డులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలా వరుసగా ఐదో సారి జాతీయస్థాయి ఉత్తమ అవార్డులు పొందామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కొత్తరకం టెక్నాలజీ సేవలు, యాప్ ద్వారా మోబైల్ సేవలు, నగదు డిపాజిట్ యంత్రాల స్థాపన, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. సమావేశంలో బ్యాంకు వైఎస్ చైర్మన్ సూరపల్లి రమేశ్, డైరక్టర్లు విజయ్‌కుమార్, కర్నాటి పాండు, పెండెం రఘు, కర్నాటి బాలసుబ్రమణ్యం, గుండు మధు, చిక్క విష్ణు, నోముల రఘు, రాపోలు వేణు, అందె బస్వయ్య, సీనియర్ మేనేజర్ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement