‘చంద్రబాబు’ దిగిపో! | Gandhian patti seshaiah fires on ap cm chandrababu over mlas buying | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు’ దిగిపో!

Published Thu, Jun 2 2016 12:13 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

‘చంద్రబాబు’ దిగిపో! - Sakshi

‘చంద్రబాబు’ దిగిపో!

‘అవినీతి, అసమర్థ, అక్రమాల పాలనతో రాష్ట్రాన్ని నడపలేవు. ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపో’ అంటూ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోథులు, సర్వోదయ సంఘ ప్రధాన కార్యదర్శి పత్తి శేషయ్య పిలుపునిచ్చారు.

గాంధేయవాది పత్తి శేషయ్య పిలుపు
ఆకివీడు: ‘అవినీతి, అసమర్థ, అక్రమాల పాలనతో రాష్ట్రాన్ని నడపలేవు. ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపో’ అంటూ గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోథులు, సర్వోదయ సంఘ ప్రధాన కార్యదర్శి పత్తి శేషయ్య పిలుపునిచ్చారు.

ఆకివీడు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు, రాజ్యసభ సభ్యుల ఎంపిక వంటి వాటితో పాటు డబ్బుతో రాజకీయాన్ని ముడిపెట్టడం తగదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉండాలి. అయితే ప్రతిపక్షం లేకుండా వచ్చే ఎన్నికల్లో 80 శాతం ప్రజలు మనవైపే ఉండాలని ఆలోచించడం అవివేకమన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న ఉద్యమాలకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement